రెడ్‌మి నోట్ 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కీలక సమాచారం లీక్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, లాంచ్ వివరాలు!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి నుంచి ఈ సంవత్సరం జనవరిలో రెడ్‌మి నోట్ 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. అయితే తాజాగా వస్తున్న లీక్‌ల ఆధారంగా రెడ్‌మి నోట్ 14 ప్రో 5G హ్యాండ్‌సెట్‌ను (Redmi Note 14 Pro 5G) అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఫోన్ డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ హ్యాండ్‌సెట్ గురించి కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. Gizmochina రిపోర్టు మరియు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వివరాల ఆధారంగా రెడ్‌మి నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ సన్నని డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియ గత మోడల్ కంటే మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుంది.

ఈ టిప్‌స్టర్ వివరాల ఆధారంగా ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 1.5k అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేయనుందని తెలుస్తోంది. అయితే టిప్‌స్టర్ కచ్చితంగా ఈ స్పెసిఫికేషన్‌లు నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించినవిగా వెల్లడించలేదు.
దీంతోపాటు ఈ రెడ్‌మి నోట్ 14 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీపై స్పష్టత లేదు. అయితే కొన్ని నివేదికల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే భారత్‌లో మాత్రం 2025 నాటికి విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ధర రూ.25,000- రూ.30,000 మధ్య ఉండే అవకాశం ఉంది.
ఇటీవల రెడ్‌మి నోట్ ప్రో+ 5G వరల్డ్ ఛాంపియన్స్ ఎడిషన్ లాంచ్ అయింది. ఈ స్పెషల్ ఎడిషన్‌ను అర్జెంటీనా పుట్‌పాల్ అసోసియేషన్ సహకారంతో తయారుచేసి విడుదల చేశారు. ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యా్మ్ +512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంది.
దీంతోపాటు ఈ ఎడిషన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. అయితే సాధారణ మోడల్ తరహాలో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1.5K రిజల్యూషన్‌తో విడుదల అయింది. డిస్‌ప్లే రక్షణ కోసం గొరెల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్‌ను కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తోంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 200MP ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరాలు సహా 120W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు IP68 రేటింగ్‌తో వాటర్, డస్ట్ర రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








