Home
Mobile

తక్కువ ధరలో 4 సంవత్సరాల అప్‌డేట్స్‌, 50MP కెమెరా, ఫుల్ HD+ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌..!

రెడ్‌మి నుంచి గత నెలలో భారత్‌ మార్కెట్‌ లోకి రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ ఫోన్‌ (Redmi Note 14 SE 5G Smartphone) అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ ఏకంగా 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. దీంతోపాటు ఈ ఫోన్ 50MP కెమెరా, 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రస్తుతం రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

రూ.13,999 ధరకే :
రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ ఆగస్టు తొలి వారంలో సేల్‌ ప్రారంభం అయింది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) రూ.13999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ క్రిమ్సన్‌ ఆర్ట్‌, మిస్టిక్‌ వైట్‌, టైటాన్‌ బ్లాక్‌ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Redmi Note 14 SE 5G smartphone pricecut

రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 6GB LPPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది.

ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.67 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

50MP కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్‌ లైట్‌ ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు, డాల్బీ అట్మాస్‌ సపోర్టు :
రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తోంది. సెక్యూరిటీ కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్‌ కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, Wi-Fi 802.11 ac, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 14 SE 5G smartphone now available at Rs13999 price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X