రూ.15 వేల ధరలో 50MP కెమెరా, ఆకట్టుకొనే డిజైన్, 128GB స్టోరేజీతో 5G స్మార్ట్‌ఫోన్.. సేల్ ప్రారంభం..!
Redmi Note 14 SE 5G Smartphone Sale : రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్ లో ఇటీవల విడుదల అయింది. ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. ఈ ఫోన్ బడ్జెట్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP కెమెరా, 5110mAh బ్యాటరీ, 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని తెలుస్తోంది. ఈ రెడ్‌మి ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ప్రస్తుతం Mi.com, ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ల కారణంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రెడ్‌మి ఫోన్ క్రిమ్సన్ ఆర్ట్, మిస్టిక్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ :
రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను పొందుతుంది.
మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ హ్యండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 6GB LPPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తుంది. రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.

50MP సోనీ కెమెరా, 5110mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలు మరియు LED ఫ్లాష్ లైట్ ను కలిగి ఉంది. మరియు 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది.
IP64 రేటింగ్, డాల్బీ అట్మాస్ సపోర్టు :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, WiFi 802.11 ac, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. డాల్బీ అట్మాస్, Hi Res ఆడియోతో స్టీరియో స్పీకర్ లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు.


Click it and Unblock the Notifications








