Home
Mobile

రూ.15 వేల ధరలో మంచి ఫోన్‌ కోసం చూస్తున్నారా.. సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP OIS కెమెరా ఆకట్టుకొనే ఫీచర్లు!

Redmi Note 14 SE 5G Smartphone : భారత్‌ మార్కెట్‌ లో రూ.15 వేల ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులో ఉన్నాయి. అయితే రెడ్‌మి లాంచ్‌ చేసిన హ్యాండ్‌సెట్‌ ప్రస్తుతం బడ్జెట్ ధరలో అందుబాటులోకి ఉంది. రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ 50MP కెమెరా, FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు. రూ.15 వేల ధరలో లేటెస్ట్‌ 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ హ్యాండ్‌సెట్‌ ను ఓ ఆప్షన్‌ గా భావించవచ్చు.

Redmi Note 14 SE 5G

సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంటుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 6GB LPPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని రెడ్‌మి హామీ ఇచ్చింది.

మూడు కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ( OIS ) సపోర్టుతో 50MP సోనీ LYT - 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌ ఉన్నాయి. LED ఫ్లాష్‌ లైట్‌ కూడా ఉంది. వీటితోపాటు ముందు వైపు 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
రెడ్‌మి నోట్‌ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌ క్రిమ్సన్‌ ఆర్ట్‌, టైటాన్‌ బ్లాక్‌, మిస్టిక్‌ వైట్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

డాల్బీ అట్మాస్‌ సపోర్టు, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ :
కనెక్టివిటీ పరంగా ఈ రెడ్‌మి ఫోన్ 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్‌ 5.3, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్- డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్ ఉంది. డాల్బీ అట్మాస్, Hi- Res ఆడియో సపోర్టుతో స్పీకర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 14 SE 5G Smartphone with 50MP Camera, 5110mAh Battery now at Rs14999 price on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X