రెడ్‌మి నుంచి 'కిల్లర్ నోట్'.. ఎప్పుడు విడుదల కానుంది.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!
Redmi Note 14 SE : రెడ్‌మి నుంచి నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ మోడల్స్ గత సంవత్సరం అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలో రెడ్‌మి నుంచి మరో ఫోన్ విడుదల కానుంది. రెడ్‌మి నోట్ 14 SE స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో జులై 28 న విడుదల కానుంది. ఈ ఫోన్ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది.
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా రెడ్‌మి నోట్ 14 SE స్మార్ట్‌ఫోన్ కీలకమైన స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ను రెడ్‌మి కిల్లర్ నోట్‌గా పిలుస్తోంది. బోల్డ్ డిజైన్, ఆకట్టుకొనే స్పెసిఫికేషన్‌లతో అందుబాటు ధరకే లాంచ్ కానుందని తెలుస్తోంది.

డిస్‌ప్లే వివరాలు :
రెడ్‌మి విడుదల చేసిన టీజర్ ఆధారంగా నోట్ 14 SE స్మార్ట్‌ఫోన్ రెడ్ కలర్ వేరియంట్ లో లభిస్తుంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
రెడ్‌మి నోట్ 14 SE స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. OS వివరాలతోపాటు ఎన్ని సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుందో వెల్లడి కావాల్సి ఉంది. మరియు స్టోరేజీ వేరియంట్స్ వివరాలు తెలియాల్సి ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ LYT-600 కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, ఇతర కెమెరాల గురించి తెలియాల్సి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే ఛార్జింగ్ వివరాలు తెలియాల్సి ఉంది.
ఏ ధరలో విడుదల కానుంది?
ఈ హ్యాండ్‌సెట్ భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో అవుట్‌పుట్ కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
* మరో స్మార్ట్‌ఫోన్ :
రెడ్‌మి నుంచి త్వరలో గ్లోబల్ మార్కెట్‌లోకి రెడ్‌మి 15c స్మార్ట్‌ఫోన్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మీడియాటెక్ హీలియో G81 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. HyperOS పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. అలాగే 50MP AI కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాను ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 4G LTE, బ్లూటూత్, వైఫై, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








