రూ.14999 ధరకే 50MP కెమెరా, 5110mAh బ్యాటరీతో రెడ్‌మి 5G ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
Redmi Note 14 SE 5G Smartphone : షియోమీ సంస్థ భారత్ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులోకి వచ్చింది. అయినా 50MP కెమెరా, 5110mAh బ్యాటరీ సహా అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. Mi.com, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ 120Hz రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

మీడియాటెక్ చిప్‌సెట్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 6GB LPPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hyper OS పైన పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుకు వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను అమర్చి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను అమర్చారు.

5110mAh బ్యాటరీ :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 802.11 ac, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. క్రిమ్సన్ ఆర్ట్, మిస్టిక్ వైట్, టైటాన్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.
IP64 రేటింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్, Hi Res ఆడియోతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రెడ్‌మి నోట్ 14 SE 5G స్మార్ట్‌ఫోన్ (Redmi Note 14 SE 5G Sale) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది. ఆగస్టు 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.
తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.1000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Mi.com, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








