రెడ్‌మి నోట్ 14 సిరీస్ సేల్ ప్రారంభం.. మూడు ఫోన్‌ల ప్రత్యేకతలు, ధర, సేల్ పూర్తి వివరాలు..!
భారత్ మార్కెట్‌లో ఇటీవల విడుదలైన రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల సేల్ (Redmi Note 14 Series Sale is Live) ఇవాళ ప్రారంభం అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు రెడ్‌మి బడ్స్ 6, సౌండ్ స్పీకర్‌ల సేల్ ప్రారంభం అయింది. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. బేస్ వేరియంట్.. సంస్థ అధికారిక వెబ్‌సైట్ సహా అమెజాన్‌లో లభించనుంది. ప్రో మోడళ్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.
ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా రూ.1000 బోనస్‌ను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తోపాటు రెడ్‌మి బడ్స్ 6 ను రూ.2,799 కే కొనుగోలు చేయవచ్చు. అదే అవుట్‌డోర్ స్పీకర్‌లను రూ.3,499 కే సొంతం చేసుకోవచ్చు.

రెడ్‌మి నోట్ 14 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ;
రెడ్‌మి నోట్ 14 స్మార్ట్‌ఫోన్ (Redmi Note 14 Smartphone) 120z రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. మరియు HDR10+ ను సపోర్టు చేస్తోంది.
రెడ్‌మి నోట్ 14 సిరీస్ బేస్ వేరియంట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS తో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చి ఉంది.

కెమెరా విభాగం పరంగా f/1.7 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో 50MP సోనీ LYT 600 ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. అమెజాన్, Mi.com, షియోమీ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మి నోట్ 14 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో (Redmi Note 14 Pro Smartphone) హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల 1.5k కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లా్స్ విక్టస్ 2 రక్షణను కలిగి ఉంది. 50MP సోనీ LYT 600 ప్రధాన కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 20MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ ప్రో మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOSను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 3 OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
అదే రెడ్‌మి నోట్ 14 ప్రో మోడల్ సేల్ కూడా ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఈ ప్రో మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, mi.com, షియోమీ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.67 అంగుళాల 1.5k కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కల్పిస్తుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 50MP లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ లెన్స్, 50MP శాంసంగ్ JN1 పొర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాను అమర్చి ఉంటుంది.

ఈ హైఎండ్ వేరియంట్ (Redmi Note 14 Pro Plus Smartphone) ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 3.1 (512GB స్టోరేజీ) మరియు 256GB UFS 2.2 (256GB స్టోరేజీ) తో జతచేసి ఉంటుంది.
అదే రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ హ్యాండ్‌సెట్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర అధికారిక ప్లాట్‌ఫాంల ద్వారా సొంతం చేసుకోవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.30,999, అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.32,999, మరియు 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ రూ.35,999 గా ఉంది.


Click it and Unblock the Notifications








