Home
Mobile

భారీ బ్యాటరీ, సూపర్‌ కెమెరాలతో రెడ్‌మి నోట్‌ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ఎప్పుడు విడుదల కానుందంటే?

రెడ్‌మి నోట్‌ 14 సిరీస్‌ విడుదల తేదీ వెల్లడైంది. భారత్‌ మార్కెట్‌లో ఈ సిరీస్‌ లాంచ్‌ వివరాలను షియోమీ ఇండియా వెల్లడించింది. ఈ సిరీస్‌లో భాగంగా నోట్ 14, నోట్‌ 14 ప్రో, నోట్‌ 14 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానున్నాయి. ఈ రెడ్‌మి నోట్‌ 14 స్మార్ట్‌ఫోన్‌లు (Redmi Note 14 Series) అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు, మెరుగైన కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

షియోమీ ఇండియా ప్రకటన ఆధారంగా రెడ్‌మి నోట్‌ 14 సిరీస్‌ భారత్‌ మార్కెట్‌లో డిసెంబర్ 9 వ తీదీన లాంచ్‌ కానుంది. చైనాలో ఈ సంవత్సరం సెప్టెంబర్‌లోనే ఈ హ్యాండ్‌సెట్‌లు విడుదల అయ్యాయి. చైనా వేరియంట్‌ స్పెసిఫికేషన్‌లనే భారత్‌ వేరియంట్ కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజైన్ విషయంలో మార్పులు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

Redmi Note 14 Series Smartphones india launch date

రెడ్‌మి నోట్‌ 14 సిరీస్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
ప్రస్తుతం ఈ రెడ్‌మి సిరీస్‌ కోసం షియోమీ ఇండియా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం చైనాలో విడుదలైన రెడ్‌మి నోట్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. మరియు 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది.

రెడ్‌మి నోట్‌ 14 ప్రో చైనా వేరియంట్ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. భారత్ మార్కెట్‌లో ఈ సిరీస్‌ ప్రారంభ ధర ఎంత ఉంటుందనే సమాచారం వెల్లడి కాలేదు.

అయితే భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్‌ వేరియంట్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రైమరీ, 50MP పొర్ట్రెయిట్‌ టెలిఫొటో సహా 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 90Hz ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6,200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

భారత్‌లో రెడ్‌మి నోట్‌ 14 ప్రో మోడల్‌ 5500mAh బ్యాటరీలో విడుదల కానుందని తెలుస్తోంది. మరియు 50MP ప్రైమరీ కెమెరాతోకూడిన ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బేస్‌ వేరియంట్ కంటే మెరుగైన స్సెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో అందుబాటులో ఉంటుందని సమాచారం.

ఈ సిరీస్ ముఖ్యంగా డిస్‌ప్లే క్వాలిటీ, నాణ్యమైన కెమెరా, బ్యాటరీపైన దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా మిడ్‌ రేంజ్ సెగ్మెంట్‌లో ఇతర బ్రాండ్‌లకు గట్టిపోటీ నిచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై షియోమీ ఇండియా ఎటువంటి ప్రకటన చేయలేదు. కచ్చితమైన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 14 Series Smartphones confirmed to launch on december 9 in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X