రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ, కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్..!
రెడ్‌మి నుంచి త్వరలో రెడ్‌మి నోట్ 14 సిరీస్ (Redmi Note 14 Series) త్వరలో భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో రెడ్‌మి నోట్ 14, రెడ్‌మి నోట్ 14 ప్రో, రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ హ్యాండ్‌సెట్‌లు ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సిరీస్ భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఇందుకు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఈ సిరీస్ హైఎండ్ వేరియంట్ 6200mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెడ్‌మి నోట్ 14 సిరీస్ భారత్ మార్కెట్‌లో (Redmi Note 14 Series launch date) డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అంచనా వేశారు. మరియు జనవరి 10 నుంచి జనవరి 15 తేదీల మధ్య కాలంలో ఈ సిరీస్ సేల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

రెడ్‌మి నోట్ 14 సిరీస్ చైనాలో ఇప్పటికే విడుదల అయింది. చైనా వేరియంట్‌తో పోలిస్తే భారత్‌లో త్వరలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్ వేర్వేలు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. అయితే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
రెడ్‌మి నోట్ 14 సిరీస్ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ సిరీస్ బేస్ వేరియంట్ రెడ్‌మి నోట్ 14.. 6.67 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K డిస్‌ప్లే ను కలిగి ఉండే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి నోట్ 14 డ్యూయల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే ప్రో మోడల్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే ప్రో ప్లస్ మోడల్ వీటితోపాటు టెలిఫోటో కెమెరాతో విడుదల కానుందని తెలుస్తోంది.
రెడ్‌మి నోట్ 14 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రో ప్లస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేసే అవకాశం ఉంది.
రెడ్‌మి నోట్ 14 సిరీస్ బ్యాటరీ అంచనా వివరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బేస్ వేరియంట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు 5,110mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అదే ప్రో మోడల్ 5,500mAh బ్యాటరీ, ప్రో ప్లస్ మోడల్ 6,200mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రో వేరియంట్‌లు 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది.
అయితే ఈ రెడ్‌మి నోట్ 14 సిరీస్ లీక్ వివరాలపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతోపాటు విడుదల తేదీపైనా సంస్థ స్పందించలేదు. గత మోడళ్ల కంటే మెరుగైన పరితీరు సహా అప్‌గ్రేడ్ ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








