Home
Mobile

మిడ్‌ రేంజ్‌ ధరలో రెడ్‌మి నోట్‌ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు.. సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే..?

రెడ్‌మి నోట్‌ 14 సిరీస్‌ (Redmi Note 14 Series Sale) ఇటీవల భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్‌ 14, నోట్‌ 14 ప్రో, నోట్‌ 14 ప్రో ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు భారత్‌లో రెడ్‌మి బడ్స్‌ 6 కూడా విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌ ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు అనేక సూపర్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. బడ్స్, కొత్త స్మార్ట్‌ఫోన్‌లు డిసెంబర్‌ 13 నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

రెడ్‌మి నోట్‌ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు :
రెడ్‌మి నోట్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999, అదే 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.19,999, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.21,999 గా ఉంది.

Redmi Note 14 Series smartphones sale

రెడ్‌మి నోట్‌ 14 ప్రో మోడల్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999, 12GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ రూ.35,999 గా ఉంది.

రెడ్‌మి నోట్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ డిసెంబర్‌ 13న ప్రారంభం కానుంది. mi.com మరియు షియోమీ రిటైల్‌ స్టోర్‌లు, ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. అదే ప్రో మోడళ్లు డిసెంబర్ 13 నుంచే సేల్‌ ప్రారంభం కానుండగా.. ఫ్లిప్‌కార్ట్ సహా సంస్థ అధికారిక ప్లా్ట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

రెడ్‌మి నోట్‌ 14 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల FHD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+ ను సపోర్టు చేస్తోంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC తో పనిచేస్తుంది. 12GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 2.2 చిప్‌సెట్‌తో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5,110mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.7 అపేచర్‌తో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

రెడ్‌మి నోట్‌ 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+ సపోర్టు సహా గొరెల్లా గ్లా్స్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది.

మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB LPDDR4X ర్యామ్‌ మరియు గరిష్ఠంగా 512GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS తో పనిచేస్తుంది. మూడు OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని సంస్థ తెలిపింది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT-600 కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రా వైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాలు సహా 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ప్రో మోడల్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రెడ్‌మి నోట్‌ 14 ప్రో ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డాల్బీ విజన్‌ మరియు HDR10+ సపోర్టు చేస్తుంది. మరియు గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణ కల్పిస్తుంది.

ఈ ప్రో ప్లస్‌ మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 16GB LPDDR5X ర్యామ్‌, 512GB UFS 3.1 మరియు 256GB UFS 2.2 తో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. దీంతోపాటు షియోమీ పాస్కల్‌ T1 సిగ్నల్‌ ఎన్‌హేన్స్‌మెంట్‌ చిప్‌ను అమర్చి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ సపోర్టుతో 50MP లైట్‌ ఫ్యూజన్‌ 800 ప్రైమరీ కెమెరా, 8MP సోనీ IMX355 అల్ట్రావైడ్ లెన్స్‌, 50MP శాంసంగ్‌ JN1 పొర్ట్రెయిట్‌ టెలిఫోటో కెమెరాను అమర్చి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 14 Series smartphones sale to start from december 13th in india here is the deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X