రెడ్‌మి నుంచి 108MP కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లే సహా సూపర్ ఫీచర్‌లతో 5G స్మార్ట్‌ఫోన్!
రెడ్‌మి నుంచి భారత్ మార్కెట్ లోకి త్వరలో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. రెడ్‌మి నోట్ 15 5G పేరుతో (Redmi Note 15 5G Smartphone) లాంచ్ కానుంది. షియోమీ సంస్థ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అయితే భారత్ లో విడుదల తేదీ కంటే ముందుగానే ఇంటర్నేషనల్ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్ మార్కెట్ లో రెడ్‌మి నోట్ 15 5G, రెడ్‌మి నోట్ 15 108 మాస్టర్ పిక్సల్ ఎడిషన్ విడుదల కానున్నాయి. షియోమీ వెల్లడించిన వివరాల ఆధారంగా జనవరి 6 వ తేదీన లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ లకు సంబంధించిన అనేక వివరాలు అమెజాన్ మైక్రోసైట్ తో వెల్లడయ్యాయి.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రూ.20 వేల ధర సెగ్మెంట్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. గ్లోబల్ వేరియంట్ కూడా ఇదే చిప్ తో పనిచేస్తుందని తెలుస్తోంది.
ఈ OS పైన పనిచేస్తుందా? :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ కారణంగా యూజర్లు 10 శాతం GPU బూస్ట్, 30 శాతం మెరుగైన CPU పనితీరు, 48 నెలల ల్యాగ్ ఫ్రీ వంటి ప్రయోజనాలను పొందవచ్చని షియోమీ చెబుతోంది.
డిస్‌ప్లే వివరాలు :
గ్లోబల్ మార్కెట్స్ లో రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ముందువైపు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
108MP కెమెరా! :
అమెజాన్ మైక్రోసైట్ ఆధారంగా ఈ ఫోన్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
గ్లోబల్ మార్కెట్‌లో రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అయితే కొన్ని గ్లోబల్ మార్కెట్లలో 18W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
* ఇటీవల రెడ్‌మి 15c 5G ఫోన్ సేల్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12499 గా ఉంది. ఈ ఫోన్ 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. 50MP AI కెమెరా, 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.


Click it and Unblock the Notifications








