Home
Mobile

108MP కెమెరా, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5G ఫోన్‌ విడుదల..!

Redmi Note 15 5G Smartphone : షియోమీ సంస్థ భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్‌, రెడ్‌మి ప్యాడ్‌ 2 ప్రో ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 108MP కెమెరాను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుందని షియోమీ చెబుతోంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుందని షియోమీ తెలిపింది.

Redmi Note 15 5G Smartphone launch telugu news

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ రెడ్‌మి ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీ ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మైక్రో SD ను సపోర్టు చేస్తుందని సంస్థ తెలిపింది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని షియోమీ హామీ ఇచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ త్వరలోనే ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 అప్‌డేట్స్‌ను పొందుతుందని సంస్థ వెల్లడించింది.

108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ఉన్నాయి. ముందువైపు 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. వెనుక కెమెరాలు 30fps తో 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. సెల్ఫీ కెమెరా 30fps తో 1080p రిజల్యూషన్‌ను సపోర్టు చేస్తుంది.

Redmi Note 15 5G Smartphone launch telugu news

ఫాస్ట్‌ ఛార్జింగ్ :
ఈ హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 18W రివర్స్‌ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.1, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, AI ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి.

Take a Poll

రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ వివరాలు :
రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను అందిస్తుంది.

ఈ ఫోన్‌ సేల్‌ జనవరి 9 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ కొనుగోలుపై డిస్కౌంట్‌తోపాటు రెండు నెలల యూట్యూబ్‌ ప్రీమియం, మూడు నెలల Spotify ప్రీమియం స్టాండర్డ్‌ సబ్‌స్క్రిప్షన్, 6 నెలల వరకు గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తామని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 15 5G Smartphone launched with 108MP Camera, snapdragon 6 Gen 3 Chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X