108MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్... ధర వివరాలు లీక్!
Redmi Note 15 5G Smartphone : భారత్ మార్కెట్ లో రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. జనవరి 6 వ తేదీన లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు క్రమంగా వెల్లడవుతున్నాయి. అయితే ధర సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ధర వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్‌తోపాటు రెడ్‌మి నుంచి ట్యాబ్లెట్ కూడా విడుదల కానుంది. ఇటీవలే ట్యాబ్లెట్ టీజర్‌ను రెడ్‌మి ఇండియా తన X హ్యాండిల్ లో షేర్ చేసింది.
రెడ్‌మి ఫోన్ ధర వివరాలు లీక్ :
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వివరాల ఆధారంగా రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999, అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999 గా ఉంటుందని తెలిపారు.

రెడ్‌మి ట్యాబ్లెట్ కూడా లాంచ్ కానుంది :
ఈ సిరీస్‌తోపాటు రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ట్యాబ్లెట్ భారత్ మార్కెట్ లో త్వరలో విడుదల కానుంది. ఇటీవలే ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే చైనా సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో రెడ్‌మి నోట్ 15 5G, నోట్ 15 ప్రో 5G, నోట్ 15 ప్రో ప్లస్ 5G మోడల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
చిప్‌సెట్ వివరాలు :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 10 శాతం GPU బూస్టింగ్, 30 శాతం మెరుగైన పనితీరు, 48 నెలల ల్యాగ్ ఫ్రీ వినియోగానికి అవకాశం ఉంటుందని షియోమీ చెబుతోంది. HyperOS 2 పైన పనిచేస్తుంది.
అమోలెడ్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రాటెక్షన్ ను పొందుతుంది. ఫోన్ కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్లు ఉండనున్నాయి.
108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 108MP ప్రైమరీ, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుందని సమాచారం. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
ఫాస్ట్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో :
బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 18W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో అందుబాటులో ఉంటుందని సమాచారం. దీంతోపాటు IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications








