108MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 డిస్కౌంట్.. అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సహా సూపర్ ఫీచర్లు!
భారత్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో విడుదల అవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు చాలా వరకు కెమెరా, బ్యాటరీ లవర్స్ టార్గెట్‌గానే ఉంటున్నాయి. రియల్‌మి ఏకంగా 10001mAh బ్యాటరీతో P4 పవర్, నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. అదే సమయంలో అనేక బ్రాండ్‌లు 200MP కెమెరాలతో ఫోన్‌లు విడుదల అయ్యాయి. రూ.30 వేల ధరలోనూ 200MP కెమెరాతో వివో V60e ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే 108MP కెమెరా ఫోన్ ప్రస్తుతం రూ.20 వేల ధర సెగ్మెంట్‌లో అందుబాటులో ఉంది.
ఈ సంవత్సరం జనవరి నెలలో రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ (Redmi Note 15 5G Smartphone) విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22998, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24998 గా ఉంది.

రూ.2000 డిస్కౌంట్ :
ఈ ఫోన్‌ను SBI, HDFC బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, మిస్ట్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
అమోలెడ్ డిస్‌ప్లే :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ రెడ్‌మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని రెడ్‌మి హామీ ఇచ్చింది.
108MP కెమెరా :
ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. 30fps తో 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. వీటితోపాటు 20MP సెల్ఫీ కెమెరా ఉంది. 30fps తో 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ :
ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ 18W రివర్స్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్, Hi-Res ఆడియో సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








