Home
Mobile

108MP కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌ ఫోన్‌ సేల్‌!

భారత్‌ మార్కెట్‌లో ఇటీవలే రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్‌ (Redmi Note 15 5G Smartphone Sale) విడుదల అయింది. ఈ ఫోన్ 108MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ కెమెరాలతో 4K వీడియోను రికార్డు చేయవచ్చు.

ఎక్కడ కొనుగోలు చేయాలి :
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. Mi.com తోపాటు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది.

redmi note 15 5g price

రూ.2000 డిస్కౌంట్‌ :
రెడ్‌మి సంస్థ వెబ్‌సైట్‌లో ICICI బ్యాంకు కార్డుల EMI లావాదేవీలపై రూ.3000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. అదే సాధారణ పేమెంట్‌ పై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌పైన 2 నెలల యూట్యూబ్‌ ప్రీమియం, 3 నెలల Spotify ప్రీమియం స్టాండర్డ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తామని తెలిపింది. దీంతోపాటు 6 నెలల వరకు గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చని తెలిపింది.

డిస్‌ప్లే వివరాలు :
రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

redmi note 15 5g price

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

108MP కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 108MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాలున్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక ఉన్న కెమెరాలు 30fps తో 4K వీడియో రికార్డింగ్‌, అదే సెల్ఫీ కెమెరాతో 30fps తో 1080p వీడియోలను రికార్డు చేయవచ్చు.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌ :
రెడ్‌మి నోట్‌ 15 5G స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 18W రివర్స్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.1, GPS, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

డాల్బీ అట్మాస్‌ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌, Hi-Res ఆడియో సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, AI ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 15 5G Smartphone with 108MP Camera sale start from today in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X