Home
Mobile

200MP కెమెరా, 6.83 అంగుళాల డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. రూ.3000 డిస్కౌంట్‌

Redmi Note 15 Pro 5G Series Sale : భారత్ మార్కెట్‌ లో గత నెల చివర్లో రెడ్‌మి నోట్‌ 15 ప్రో సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌ ముందస్తు బుకింగ్‌ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఇవాళ్టి నుంచి సేల్‌ ప్రారంభం అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్‌ 15 ప్రో, రెడ్‌మి నోట్‌ 15 ప్రో ప్లస్‌ మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ ఫోన్‌లు 200MP కెమెరా, 6.83 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

రూ.3000 డిస్కౌంట్‌ :
రెడ్‌మి 15 ప్రో 5G సిరీస్‌ ఫోన్‌లు ప్రస్తుతం అమెజాన్, రెడ్‌మి అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉన్నాయి. బేస్‌ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29999, 8GB ర్యామ్ + 256GB ‌స్టోరేజీ ధర రూ.31999 గా ఉంది.

Redmi Note 15 Pro 5G series sale in india

అదే ప్రో ప్లస్ మోడల్ ధర 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.43999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

రెడ్‌మి నోట్‌ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
రెడ్‌మి నోట్‌ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 200MP OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 20MP సెల్ఫీ కెమెరాలున్నాయి. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 22.5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6580mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రెడ్‌మి నోట్‌ 15 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ :
రెడ్‌మి నోట్‌ 15 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 6.83 అంగుళాల 1.5K CrystalRes అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP66, IP68, IP69, IP69K రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. 200MP OIS కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 100W వైర్‌ ఛార్జింగ్, 22.5 రివర్స్‌ వైర్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 15 Pro 5G series smartphones with 200MP camera sale is live on amazon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X