200MP కెమెరాతో రెండు స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. అమోలెడ్ డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెంట్, రివర్స్ ఛార్జింగ్..!
Redmi Note 15 Pro 5G Series : రెడ్‌మి నోట్ 15 ప్రో సిరీస్ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా నోట్ 15 ప్రో 5G, నోట్ 15 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్ ఫోన్‌లు 200MP కెమెరా, 6.83 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
రెడ్‌మి నోట్ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
నోట్ 15 ప్రో 5G 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అయ్యాయి. 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

నోట్ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌ను కలిగి ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 6580mAh బ్యాటరీని కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6 ఫీచర్లున్నాయి. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్‌లు ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K CrystalRes అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్, HDR10+ ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
నోట్ 15 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 100W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 22.5W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోన్ 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6/6E, NFC, IR బ్లాస్టర్ ఫీచర్లున్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్‌లను అమర్చి ఉంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

రెడ్‌మి నోట్ 15 ప్రో 5G సిరీస్ ధర, సేల్ వివరాలు :
ఈ సిరీస్ సేల్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుంది. నోట్ 15 ప్రో ప్లస్ మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.43999 గా ఉంది. ప్రో ప్లస్ మోడల్‌ను రూ.1999 చెల్లించి అమెజాన్‌లో ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
అయితే ఫైనల్ ధర మాత్రం ఫిబ్రవరి 3 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 11:59PM మధ్యలో వెల్లడవుతుంది. ముందస్తు బుకింగ్‌లో చెల్లించిన మొత్తం. అమెజాన్ పే బ్యాలెన్స్‌లో తిరిగి జమ అవుతుందని సంస్థ తెలిపింది. ప్రీ ఆర్డర్ చేసిన వారు గరిష్ఠంగా రూ.4999 విలువైన ప్రయోజనాలు పొందుతారని తెలిపింది.
అయితే ICICI, HDFC బ్యాంకు కార్డుల EMI లావాదేవీలపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్, అదే ఈ రెండు క్రెడిట్ కార్డుల ఫుల్ పేమెంట్‌పై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, మిరాజ్ బ్లూ, కాఫీ మోచా కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
* నోట్ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999 గా ఉంది. రూ.1999 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఫిబ్రవరి ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 11:59 గంటల మధ్యలో ఫైనల్ ధర వెల్లడవుతుంది.
అయితే ప్రీ ఆర్డర్ సమయంలో చెల్లించిన మొత్తం అమెజాన్ పే బ్యాలెన్స్‌లో తిరిగి జమ అవుతుంది. దీంతోపాటు రూ.2499 విలువైన ప్రయోజనాలను పొందుతారు. ప్రో ప్లస్ మోడల్ తరహాలోనే బ్యాంకు ఆఫర్లు ఉన్నాయి. ఈ ఫోన్ సిల్వర్ సిల్వర్ యాష్, మిరాజ్ బ్లూ, కార్బన్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








