Home
Mobile

200MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 6.83 అంగుళాల డిస్‌ప్లేతో 5G ఫోన్‌.. రేపే విడుదల..!

Redmi note 15 Pro 5G Series : రెడ్‌మి నోట్‌ 15 ప్రో సిరీస్‌ భారత్ మార్కెట్‌ లో రేపు (జనవరి 29 వ తేదీ) ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నోట్‌ 15 ప్రో 5G, నోట్‌ 15 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అమెజాన్‌ ద్వారా ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. అయితే అమెజాన్‌ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ కలర్‌ వేరియంట్స్‌ సహా మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి.

రెడ్‌మి నోట్‌ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
రెడ్‌మి నోట్‌ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. HDR + AI అల్ట్రా క్లియర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.

Redmi note 15 Pro 5G Series

ఈ ఫోన్‌ 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంటుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 18W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6580mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

రెడ్‌మి నోట్‌ 15 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ :
నోట్ 15 ప్రో ప్లస్‌ మోడల్‌ 6.83 అంగుళాల 1.5K QHD అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3200 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

200MP కెమెరా :
ఈ వేరియంట్‌ కూడా 200MP కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ప్రో ప్లస్‌ మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 4 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు 100W హైపర్‌ ఛార్జ్‌ వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 22.5W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది.

ధర, కలర్‌ వేరియంట్స్‌ వివరాలు :
అమెజాన్‌ లిస్టింగ్‌ ఆధారంగా రెడ్‌మి నోట్‌ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది. సిల్వర్‌ యాష్‌, మిరాజ్‌ బ్లూ, కార్బన్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

అదే నోట్‌ 15 ప్రో ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ కార్బన్‌ బ్లాక్‌, మిరాజ్‌ బ్లూ, కాఫీ మోచా కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi note 15 Pro 5G Series with 200MP cameras launching on tomorrow in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X