రెడ్‌మి నోట్ 15 ప్రో సిరీస్ విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!
Redmi Note 15 Pro Series : రెడ్‌మి నోట్ 15 ప్రో సిరీస్ భారత్ మార్కెట్ లో విడుదల తేదీని అధికారికంగా ప్రకటన చేసింది. ఈ సిరీస్ లో భాగంగా నోట్ 15 ప్రో, నోట్ 15 ప్రో ప్లస్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో ఈ సిరీస్ ఇప్పటికే లాంచ్ అయింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.
ఎప్పుడు విడుదల కానుంది ? :
రెడ్‌మి నోట్ 15 ప్రో సిరీస్ భారత్ మార్కెట్ లో జనవరి 29 వ తేదీన విడుదల కానుంది. అయితే తాజాగా టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఈ సిరీస్ ధర వివరాలను అంచనా వేశారు. రూ.25 వేల నుంచి రూ.40 వేల ధరలో అందుబాటులోకి వస్తాయని టిప్‌స్టర్ తెలిపారు.

అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రెడ్‌మి నోట్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. మీడియాటెక్ హీలియో G200 అల్ట్రా చిప్‌సెట్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విభాగం పరంగా 200MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ సెన్సర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల CrystalRes 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుందని టిప్‌స్టర్ తెలిపారు. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ స్పెసిఫికేషన్ లు, ఫీచర్లపై రెడ్‌మి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ :
జనవరి తొలి వారంలో రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ (Redmi Note 15 5G Smartphone) భారత్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.22999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999 గా ఉంది. IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
రెడ్‌మి నోట్ 15 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పైన పనిచేస్తోంది. 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని పొందుతుంది.
108MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా 108MP ప్రైమరీ, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరాను అమర్చారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5520mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 18W రివర్స్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది.


Click it and Unblock the Notifications








