200MP కెమెరా, 6.83 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌లు..!
Redmi Note 15 Pro Series : రెడ్‌మి నోట్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ సిరీస్ భారత్ మార్కెట్‌లో జనవరి 29 వ తేదీన విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 15 ప్రో, నోట్ 15 ప్రో ప్లస్ మోడల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ సేల్ అమెజాన్ ద్వారా ప్రారంభం కానుంది. విడుదల సమయంలో ఈ వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన మైక్రోసైట్ అమెజాన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది.
200MP కెమెరా :
రెడ్‌మి నోట్ 15 ప్రో సిరీస్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 200MP కెమెరాలను కలిగి ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. HDR + AI అల్ట్రా క్లియర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. IP66 + IP68 + IP69 + IP69K డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

6500mAh బ్యాటరీ :
ఈ సిరీస్ 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 100W హైపర్ ఛార్జింగ్ సపోర్టు, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB వర్చువర్ ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని, మొత్తంగా 24GB ర్యామ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ సిరీస్ 6.83 అంగుళాల CrystalRes అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 3840Hz PWM డిమ్మింగ్‌ను సపోర్టు చేస్తుంది. హైడ్రో టచ్ 2.0 సపోర్టుతో రానుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

రెడ్‌మి నోట్ 15 ప్రో సిరీస్ ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించనుంది. అమెజాన్‌లో రూ.1990 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3 ఉదయం 10 గంటల నుంచి 11:59 PM గంటల మధ్యలో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ముందస్తు బుకింగ్ :
అయితే ఈ నగదు అమెజాన్ పే బ్యాలెన్స్‌లో తిరిగి జమ అవుతుంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారు రూ.2499 విలువైన ప్రయోజనాలను పొందనున్నారని తెలుస్తోంది. నోట్ 15 ప్రో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.
రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1999 చెల్లించి బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. వీరికి రూ.4999 విలువైన ప్రయోజనాలు అంటే సంవత్సరం వరకు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్, రెడ్‌మి వాచ్ మూవ్ ను ఉచితంగా పొందవచ్చు.
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. మిరాజ్ బ్లూ, కార్బన్ బ్లాక్, కాఫీ మోచా కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
భారత్ మార్కెట్‌లో నోట్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.19999, అదే ప్రో ప్లస్ మోడల్ రూ.29999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ ధరలు బ్యాంక్ డిస్కౌంట్‌తో ఈ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ధరలపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సిరీస్ జనవరి 29 వ తేదీన లాంచ్ కానుంది.


Click it and Unblock the Notifications








