భారీ బ్యాటరీ కావాలా? అద్భుతమైన కెమెరా కావాలా? రెడ్‌మీ నోట్ 17 vs వీవో S2లో ఏది బెస్ట్?
భారత మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రెండు కొత్త ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. మైండ్ బ్లాకింగ్ బ్యాటరీ లైఫ్‌తో షియోమీ 'రెడ్‌మీ నోట్ 17'ను తీసుకురాగా, స్లీక్ డిజైన్, అద్భుతమైన గేమింగ్, కెమెరా ఫీచర్లతో 'వీవో S2' మార్కెట్లోకి వచ్చింది. దీంతో భారీ బ్యాటరీ బ్యాకప్ కావాలా లేక అడ్వాన్స్‌డ్ కెమెరా ఫీచర్లు ఎంచుకోవాలా అని భారతీయ యూజర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను తెలుసుకోవడం ద్వారా మీ అవసరాలకు తగ్గ సరైన ఫోన్‌ను ఎంచుకోవడం సులభమవుతుంది.
రెడ్‌మీ నోట్ 17 విషయానికొస్తే.. ఇందులో ఏకంగా 8,000 మిల్లీయాంపియర్-అవర్ (mAh) సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించారు. హెవీగా వీడియోలు స్ట్రీమింగ్ చేసినా, నావిగేషన్ వాడినా రీఛార్జ్ ఇబ్బంది లేకుండా ఇది 45-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, ఇందులో ఎంట్రీ-లెవెల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్‌సెట్‌ను వాడారు. దీనివల్ల ఎక్కువ సేపు హై-ఫ్రేమ్ రేట్‌తో హెవీ గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ కాస్త నెమ్మదించే అవకాశముంది. అంతేకాకుండా, ఈ ఫోన్ 225 గ్రాముల బరువు ఉండటంతో పట్టుకోవడానికి కాస్త బరువుగా అనిపిస్తుంది.

రెడ్‌మీ నోట్ 17 vs వీవో S2: పెర్ఫార్మెన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మరోవైపు, వీవో S2 ప్రతిరోజూ బ్యాలెన్స్‌డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా డిజైన్ చేయబడింది. మల్టీటాస్కింగ్ వేగంగా సాగేందుకు ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌ని ఉపయోగించారు. దీనివల్ల బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (BGMI) వంటి గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ ఓవర్ హీట్ అవ్వకుండా, ఫ్రేమ్ రేట్ తగ్గకుండా స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. షియోమీలోని 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పోలిస్తే, వీవో S2లోని 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అత్యంత క్లియర్ సెల్ఫీలను ఇస్తుంది. వీటితో పాటు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి.
| స్పెసిఫికేషన్ | రెడ్‌మీ నోట్ 17 | వీవో S2 |
|---|---|---|
| బ్యాటరీ సామర్థ్యం | 8,000 mAh | 7,050 mAh |
| ప్రాసెసర్ | స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 | డైమెన్సిటీ 7360 టర్బో |
| ఫ్రంట్ కెమెరా | 8 MP | 32 MP |
| ఆరంభ ధర | ₹27,999 | ₹39,999 |
రెడ్‌మీ నోట్ 17 vs వీవో S2: ధర ఎంత? ఏది కొంటే బెటర్?
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏదో ఒకటి ఎంచుకునేటప్పుడు ధరల వ్యత్యాసం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అమెజాన్ ఇండియాలో రెడ్‌మీ నోట్ 17 ఆరంభ ధర రూ. 27,999గా ఉంది. అయితే బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ల ద్వారా దీని ఎఫెక్టివ్ ధర రూ. 24,999కి తగ్గుతుంది. మరోవైపు, వీవో S2 కాస్త ఎక్కువ ధరతో రూ. 39,999 వద్ద లభిస్తుంది. అయితే ఆదనంగా పెట్టే ఆ మొత్తానికి తగ్గట్లే ఇందులో కర్వ్డ్ డిస్‌ప్లే, తేలికైన బాడీ, అద్భుతమైన కెమెరా ఫీచర్లు లభిస్తాయి.
నోన్-స్టాప్ బ్యాటరీ లైఫ్ మాత్రమే మీ మొదటి ప్రాధాన్యత అయితే రెడ్‌మీ నోట్ 17 నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. రోజువారీ సాధారణ వాడకంతో ఇది సులభంగా రెండు రోజులకు పైగానే వస్తుంది. అలాకాకుండా మొబైల్ గేమింగ్, సెల్ఫీలపై ఆసక్తి ఉన్నవారైతే వీవో S2 ఎంచుకోవడం మంచిది. లేదా మరో 72 గంటలు వేచి చూస్తే మరిన్ని మంచి బ్యాంక్ EMI, ఎక్స్ఛేంజ్ డీల్స్ లభించే అవకాశముంది.


Click it and Unblock the Notifications