రెడ్మీ నోట్ 4 Vs లెనోవో కే6 పవర్ (బెస్ట్ 4జీబి ర్యామ్ ఫోన్ ఏది..?)
రెడ్మీ నోట్ 4కు షాకిస్తూ లెనోవో రూ.10,999కే 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. లెనోవో కే6 పవర్ అప్‌గ్రేడెడ్ వేరియంట్ పేరుతో ఈ ఫోన్ జనవరి 31 నుంచి Flipkartలో అందుబాట
షియోమీ తన రెడ్మీ నోట్ 4 (Redmi Note 4) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే తయారు చేసుకోండి
2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. Flipkartలో మాత్రమే ఈ ఫోన్ లు ఫ్లాష్ సేల్ పై లభ్యమవుతున్నాయి.

లెనోవో కే6 పవర్ అప్‌గ్రేడెడ్ వేరియంట్
రెడ్మీ నోట్ 4కు షాకిస్తూ లెనోవో రూ.10,999కే 4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను రంగంలోకి దింపింది. లెనోవో కే6 పవర్ అప్‌గ్రేడెడ్ వేరియంట్ పేరుతో ఈ ఫోన్ జనవరి 31 నుంచి Flipkartలో అందుబాటులో ఉంటుంది. 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ సౌకర్యంతో లెనోవో తన కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది.

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

లెనోవో కే6 పవర్ (4జీబి, 64జీబి స్టోరేజ్ వేరియంట్) స్పెసిఫికేషన్స్
5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్, 441 పీపీఐ, 450 నైట్ బ్రైట్నెస్, 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్), ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం విత్ లెనోవో వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ సోనీ IMX258 సెన్సార్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ప్రో మోడ్, పీడీఏఎఫ్ సపోర్ట్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, టైమ్ ల్యాప్స్), 8 మెగా పిక్సల్ Sony IMX219 సెన్సార్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ విత్ VoLTE, వై-ఫై, యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్, బ్లుటూత్, జీపీఎస్).

బెస్ట్ 4జీబి ర్యామ్ ఫోన్ ఏది..?
ప్రాసెసర్ ఇంకా బ్యాటరీ విభాగాల్లో లెనోవో కే6 పవర్‌తో పోలిస్తే రెడ్మీ నోట్ 4 స్వల్ప మార్జిన్‌తో ముందంజలో ఉంది. రెడ్మీ నోట్ 4 ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్‌ను కలిగి ఉండగా, లెనోవో కే6 పవర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. బ్యాటరీ విషయంలోనూ ఈ రెండు ఫోన్‌ల మధ్య స్వల్ప తేడాలను మీరు గమనించవచ్చు. రెడ్మీ నోట్ 4 ఫోన్ 4100 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోండగా, లెనోవో కే6 పవర్ 4,000mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విభాగంలో రెడ్మీ నోట్ 4తో పోలిస్తే కే6 పవర్ ముందంజలో ఉంది.


Click it and Unblock the Notifications








