Home
Mobile

రెడ్‌మి నోట్ 4కు సెలవిచ్చేయండి, 5 వస్తోంది

చైనా దిగ్గజం షియోమి గతేడాది మార్కెట్లోకి తీసుకువచ్చిన షియోమి రెడ్‌మి నోట్ 4 రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

By Hazarath

చైనా దిగ్గజం షియోమి గతేడాది మార్కెట్లోకి తీసుకువచ్చిన షియోమి రెడ్‌మి నోట్ 4 రికార్డులను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా షియోమి రెడ్‌మి నోట్5ను మార్కెట్లోకి తీసుకువస్తోందని వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు చైనా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ JD.com ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది.

అధికారికంగా త్వరలో వెల్లడయ్యే అవకాశాలు..

అధికారికంగా త్వరలో వెల్లడయ్యే అవకాశాలు..

ఈ ఫోన్‌కి సంబంధించి ఎలాంటి ఫీచర్లు విడుదల చేయనప్పటికీ కొన్ని వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

5.9 అంగుళాల డిస్‌ప్లే ..

5.9 అంగుళాల డిస్‌ప్లే ..

పలు టెక్‌ వెబ్‌సైట్లు పేర్కొన్న కథనాల ప్రకారం రెడ్‌మి నోట్‌5.. 5.9 అంగుళాల డిస్‌ప్లే తో పాటు స్నాప్‌డ్రాగన్‌ 660 లేదా మీడియా టెక్‌ పీ25 ప్రాసెసర్‌ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కెమెరా..

కెమెరా..

కెమెరా విషయానికొస్తే 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఇది పనిచేయనుందని తెలుస్తోంది.

గత ఫోన్ల మాదిరిగానే..

గత ఫోన్ల మాదిరిగానే..

రెడ్‌మి గత ఫోన్ల మాదిరిగానే 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌.. 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజీతో రానుంది. ఎంఐయూఐ 9 ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్‌ 7.1.2 నోగట్‌తో ఇది పనిచేస్తుంది.

రెడ్‌మి నోట్‌5ఏను

రెడ్‌మి నోట్‌5ఏను

షియోమి ఇప్పటికే రెడ్‌మి నోట్‌5ఏను చైనాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 5 Listed Online, With 18:9 Display Aspect Ratio, Dual Rear Cameras Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X