చైనా మొబైల్ దిగ్గజం షియోమి వినియోగదారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొత్తగా లాంచ్ చేసిన రెడ్‌మి నోట్5, రెడ్‌మి నోట్ 5 ప్రోలకు భారీ డిమాండ్ ఏర్పడ్డంతో ఆ ఫోన్ల అమ్మకాలు ఈ కామర్స్ సైట్లలో అవుటాఫ్ స్టాక్ అంటూ దర్శనమిచ్చాయి. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోన్లు అమ్మకాలు జరిగాయి. 3 లక్షల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు, అంటే నిమిషానికి లక్షల ఫోన్లు అమ్ముడుపోయినట్టు షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ తెలిపారు. కాగా ఇండియా చరిత్రలోనే ఇది అతిపెద్ద సేల్‌గా అభివర్ణించారు.
రెండు శాంసంగ్ ఫోన్ల ధరలు తగ్గాయి, ఫీచర్లు, తగ్గిన ధరల వివరాలు ఇవే !
నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్..
నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అయిన రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రో తర్వాతి సేల్ ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండబోతున్నట్టు పేర్కొన్నారు. నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవడంపై, కస్టమర్లు తీవ్ర నిరాశ వ్యక్తంచేస్తున్నారు.
రెడ్‌మి నోట్ 5 ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జీబీ ర్యామ్
32/64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 ఎంపీ బ్యాక్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
రెడ్‌మి నోట్ 5 ధర
స్నాప్‌డ్రాగన్625 ప్రాసెసర్ కింద బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.
రెడ్‌మి నోట్ 5 ప్రో ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్,
4/6 జీబీ ర్యామ్,
64 జీబీ స్టోరేజ్,
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
20 ఎంపీ సెల్ఫీ కెమెరా,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్‌మి నోట్ 5 ప్రో ధర
బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.13,999, రూ.16,999 ధరలకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది. రెడ్‌మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.
55 అంగుళాల స్మార్ట్‌టీవీ
దీంతో పాటు ఆ 55 అంగుళాల స్మార్ట్‌టీవీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ.కాం ద్వారా కూడా ఈ టీవి విక్రయానికి వచ్చింది.
ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ 4 ఫీచర్లు
కాగా దీని ధరను కంపెనీ రూ.39,999 గా నిర్ణయించింది. 4.9 ఎంఎం అల్ట్రా-థిన్ ఫ్రేమ్‌లెస్ డిజైన్ 55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్ 4కే రెజల్యూషన్ (3840x2160 పిక్సెల్స్) హెచ్‌డీఆర్ సపోర్ట్, 64 బిట్ 1.8 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ
లాంచింగ్ విషయానికి వస్తే..
ఇక లాంచింగ్ విషయానికి వస్తే....ఎంఐ టీవీ కొనుగోలుదారులకు రూ.619 విలువ చేసే సోనీ లివ్, హంగామా ప్లే 3 నెలల చందా ఉచితం. అలాగే ఎంఐ ఐఆర్ కేబుల్ (రూ. 299) ఫ్రీ. దీంతోపాటు రూ.1,099 విలువ చేసే ఆన్సైట్ ఇన్‌ష్టలేషన్ ఉచితం. అంతేకాదు స్మార్ట్ టీవీతో కలిపి 11-బటన్ మిని రిమోట్‌ను అందిస్తోంది. దీంతో అటు టీవీని, ఇటు సెట్-టాప్ బాక్సును నియంత్రించవచ్చు.
కనెక్టివిటీ
ఇక కనెక్టివిటీ పరంగా, మూడు హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్స్, రెండు యూఎస్‌బీ పోర్ట్స్, డ్యూయెల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 4.0, డాల్బే+డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, ప్యాచ్‌వాల్ ఓఎస్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌టీవీ సొంతం. 15 భాషల్లో ముఖ‍్యంగా 15 భాషల్లో 5,00,000లకుపైగా గంటల (వీటిలో 80 శాతం ఉచితం) అందించేందుకు వీలుగా హంగామా, ఏఎల్‌టీ బాలాజీ, జీ5, సోనీ లిప్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని షియోమి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.