రెడీమి 6 నోట్ ప్రొ కొనుగోలు చేసిన వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్న జియో
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఫోన్ యొక్క సేల్స్ ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి.
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమి తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రొ విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ ఫోన్ యొక్క సేల్స్ ఫ్లిప్ కార్ట్ లో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జియో కంపెనీ ఈ లేటెస్ట్ రెడీమి 6 నోట్ ప్రొ ను కొనుగోలు చేసిన వారికి బంపర్ ఆఫర్ ఇస్తుంది. అదేంటో చూడండి

డీల్ లో భాగంగా జియో రూ.2,400 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్....
డీల్ లో భాగంగా రెడీమి 6 నోట్ ప్రొ కొనుగోలు చేసిన వారికి జియో రూ.2,400 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ను ఇస్తుంది. దీంతో పాటు 6 టీబీ 4G మొబైల్ డేటా లభిస్తుంది.అయితే ఈ ఆఫర్ పొందాలంటే జియో రూ.299 ప్లాన్ ను రీఛార్జి చేసుకోవాల్సి వస్తుంది.అప్పుడు మీకు రూ.100 గల 24 వోచర్లు లభిస్తాయి.

రెడీమి 6 నోట్ ప్రొ ధర మరియు ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....
ధర...
4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.13,999
6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ధర రూ.15,999

ఫీచర్లు...
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే...
ఈ ఫోన్‌లో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 20, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి.

4000 ఎంఏహెచ్ బ్యాటరీ....
4000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందిస్తున్నారు. బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








