ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న షియోమి సంచలన ఫోన్లు
చైనా మొబైల్ కింగ్ మేకర్ షియోమి మరో మూడు కొత్త డివైస్‌లను ఈ రోజు ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.
చైనా మొబైల్ కింగ్ మేకర్ షియోమి మరో మూడు కొత్త డివైస్‌లను ఈ రోజు ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.కాగా ఈ ఫోన్లను Redmi Note 7,Redmi Note 7 Pro,Redmi Go పేర్లతో షియోమి లాంచ్ చేయబోతుంది.ఈ ఫోన్ల యొక్క లాంచ్ ఈవెంట్ ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 12:00 గంటలకుజరగనుంది.డిఫరెంట్ డిజైన్, డ్యూడ్రాప్ న్యాచ్‌తో షియోమి స్మార్ట్ ఫోన్లను నిలవనున్నాయి. చైనా ఇతర మొబైల్ మేకర్లు హువాయి, ఒప్పో, వన్ ప్లస్ లాంటి కంపెనీల కెమెరా ఫోన్లకు సవాల్ విసురుతూ 48 ఎంపి కెమెరా Redmi Note 7,Redmi Note 7 Pro ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.అతి త్వరలోనే ఈ మూడు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకానికి వెళుతున్నాయి.

Redmi Note 7 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

Redmi Note 7 Pro ఫీచర్లు
6.3 ఇంచుల డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.

Redmi Go ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








