Home
Mobile

Redmi Note 9 స్మార్ట్‌ఫోన్ను కొనడానికి మంచి తరుణం ఇదే!!!!

షియోమి సంస్థ గత నెలలో ఇండియాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఇండియాలో మరొసారి ఫ్లాష్ పద్దతిలో మొదలుకానున్నాయి. ఈ ఫోన్ విడుదల అయినప్పటి నుంచి కేవలం పరిమిత సమయంలో మాత్రమే అమ్మకానికి అందుబాటులోకి వస్తున్నది. ఇప్పుడు కూడా అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్ సైట్ ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. రూ.15 వేల ధర లోపు సరికొత్త హ్యాండ్‌సెట్‌ను కొనాలని చూస్తున్నట్లయితే రెడ్‌మి నోట్ 9 సరిగ్గా సరిపోతుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ మరియు ఆఫర్ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.11,999. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.13,499. చివరిది టాప్-ఆఫ్-ది-లైన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999. ఇది ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే అనే మూడు విభిన్న కలర్ ఎంపికలలో లభిస్తుంది.

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 22.5W ఫాస్ట్ ఛార్జర్‌తో 5020 mAh భారీ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 9 ఫోన్ 22.5W ఫాస్ట్ ఛార్జర్‌తో 5020 mAh భారీ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 5020 mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక రోజు మొత్తం నాన్ స్టాప్ గా వాడటానికి వీలుగా శక్తివంతమైన సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంది. షియోమి యొక్క సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్లతో బ్యాటరీ వినియోగం విషయానికి వస్తే ఫోన్ చాలా పొదుపుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది 22.5W ఛార్జర్‌తో వస్తున్నప్పటికి ఫోన్‌ను 18W వద్ద మాత్రమే ఛార్జ్ చేయవచ్చు. కానీ రెడ్‌మి నోట్ 9 లో యూజర్లు పూర్తిగా 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను ఆస్వాదించగలరని కంపెనీ ధృవీకరించింది.

రెడ్‌మి నోట్ 9 CMOS ఇమేజ్ సెన్సార్ & AI క్వాడ్ కెమెరా సెటప్

రెడ్‌మి నోట్ 9 CMOS ఇమేజ్ సెన్సార్ & AI క్వాడ్ కెమెరా సెటప్

రెడ్‌మి యొక్క బడ్జెట్ హ్యాండ్‌సెట్‌లు అద్భుతమైన కెమెరా సెటప్ లను కలిగి ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP మొదటి కెమెరా f / 1.7 లెన్స్‌తో మరియు 1 / 1.7 ″ CMOS ఇమేజ్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. అలాగే రెండవ కెమెరా f / 2.2 ఎపర్చరు మరియు 118.2 డిగ్రీల FOV లతో 8MP సెన్సార్‌ను కలిగి ఉండి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో గల మరో రెండు కెమెరాలు వరుసగా స్థూల మరియు లోతు సెన్సింగ్ కోసం 2MP సెన్సార్లను ఉపయోగిస్తాయి. అలాగే ముందు భాగంలో 13Mp సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ముందు మరియు వెనుక కెమెరాలలో ఫోటోగ్రఫీ సులభతరం చేయడానికి  AI ఫీచర్లను కలిగి ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 9 క్వాల్‌కామ్ గేమింగ్ 7XX ప్రాసెసర్

రెడ్‌మి నోట్ 9 క్వాల్‌కామ్ గేమింగ్ 7XX ప్రాసెసర్

రెడ్‌మి నోట్ 9 లో షియోమి క్వాల్‌కామ్ 7XX ప్రాసెసర్‌ను ఉపయోగించడాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.ఇది మెడిటెక్ హెలియో G85 SoC ద్వారా రన్ అవుతుంది. హెలియో G85 ను హెలియో G80 SoC కి అప్ డేట్ వెర్షన్ గా పరిగణించవచ్చు. ఇది 12nm ఉత్పాదక ప్రక్రియపై ఆధారపడి రెండు ARM కార్టెక్స్- A75 కోర్లతో 2.0 GHz వద్ద క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది GPU అప్‌గ్రేడ్‌ను చూస్తు ARM మాలి G52 MC2 చిప్‌ను ఉపయోగిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Note 9 Budget Mobile Goes Sale Today Once Again in India via Amazon and Mi.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X