Redmi నోట్ 9 ప్రో,నోట్ 9 ప్రో మాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఇవే !!!

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్ బ్రాండ్ రెడ్‌మి ఈ రోజు ఇండియాలో రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రోలను విడుదల చేశారు. ఈ రెండు కొత్త రెడ్‌మి నోట్ ఫోన్‌లు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండడమే కాకుండా పంచ్ - హోల్-డిస్ప్లేను కలిగి ఉంటాయి.

రెడ్‌మి

షియోమి ఇప్పటివరకు ఇండియాలో 100 మిలియన్ల రెడ్‌మి ఫోన్‌లను విక్రయించినట్లు లాంచ్ ఈవెంట్ లో పేర్కొంది. కొత్త రెడ్‌మి నోట్ సిరీస్‌ను ప్రారంభించడం ద్వారా సంస్థ తన లైనప్‌ను మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

 

Google కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా యొక్క మద్దతు ఫీచర్‌లు ఇవే!!!Google కొత్త క్రోమ్‌కాస్ట్ అల్ట్రా యొక్క మద్దతు ఫీచర్‌లు ఇవే!!!

రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు
 

రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు

ఇండియాలో గత వారం లాంచ్ అయిన రియల్‌మి 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా వస్తున్న ఈ రెడ్‌మి నోట్ సిరీస్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 10 ఆధారంగా రన్ అవుతున్నాయి. రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క ఇతర ముఖ్య ముఖ్యాంశాలు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉన్నాయి. కొత్త సిరీస్‌లోని రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో వస్తుంది.

 

 

ఈ టీవీని కొన్నవారికి Airtel Digital TV HD కనెక్షన్‌ ఉచితంఈ టీవీని కొన్నవారికి Airtel Digital TV HD కనెక్షన్‌ ఉచితం

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ దరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ దరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను మూడు వేరియంట్‌లో విడుదల చేసారు. ఇందులో 6GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.14,999 కాగా, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 మరియు టాప్-ఎండ్-మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.18,999. రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ యొక్క సేల్స్ మార్చి 25 నుంచి మొదలవుతాయి.

 

 

 

డౌన్‌లోడ్ స్పీడ్ లో రారాజుగా ఎదిగిన Airtelడౌన్‌లోడ్ స్పీడ్ లో రారాజుగా ఎదిగిన Airtel

రెడ్‌మి నోట్ 9 ప్రో దరల వివరాలు

రెడ్‌మి నోట్ 9 ప్రో దరల వివరాలు

ఇండియాలో రెడ్‌మి నోట్ 9 ప్రోను కేవలం రెండు వేరియంట్‌లలో మాత్రమే విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.12,999 కాగా రెండవది 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ యొక్క ధరను రూ.15,999 లుగా నిర్ణయించారు. ఇది అరోరా బ్లూ, గ్లాసియర్ వైట్ మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది. రెడ్‌మి నోట్ 9 ప్రో సేల్స్ మార్చి 17 నుండి ఇండియాలో మొదలవుతాయి.

 

 

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 11 ద్వారా రన్ అవుతుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + IPS డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం ఇది ట్రిపుల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ను వెనుక మరియు ముందు భాగంలో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC ను కలిగి ఉండడంతో పాటు 8GB LPDDR4X ర్యామ్‌తో జతచేయబడి వస్తుంది.

 

 

WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ ఫోవ్ కోసం 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ లెన్స్, మరియు 5 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటాయి. ఇది బెస్ట్ ఫోటోగ్రఫీకి కూడా మద్దతును అందిస్తుంది. ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ కనెక్టివిటీ

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ కనెక్టివిటీ

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 64GB మరియు 128GB UFS 2.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉంటాయి. మెమొరీని మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR), నావిక్, USB టైప్-C పోర్ట్ మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 33 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,020mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

 

Google Pay ద్వారా FASTag అకౌంట్లను రీఛార్జ్ చేయడం ఎలా?Google Pay ద్వారా FASTag అకౌంట్లను రీఛార్జ్ చేయడం ఎలా?

రెడ్‌మి నోట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ అన్ని కూడా రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్‌తో కొన్ని ముఖ్యమైన మార్పులతో సమానంగా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 ప్రో ఆండ్రాయిడ్ 10 మరియు MIUI 11 తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + IPS డిస్‌ప్లే 20: 9 కారక నిష్పత్తితో మరియు 1080x2400 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC, అడ్రినో 618 GPU ను కలిగి ఉండి 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది.

 

 

ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

రెడ్‌మి నోట్ 9 ప్రో కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 9 ప్రో కెమెరా సెటప్‌

రెడ్‌మి నోట్ 9 ప్రో ఫోన్ వెనుక వైపు క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ISOCELL GM2 ప్రైమరీ సెన్సార్ f/ 1.79 లెన్స్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 120-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ మూడవ సెన్సార్ మరియు డెప్త్ సెన్సింగ్ కోసం 2 మెగాపిక్సెల్ క్వాటర్నరీ సెన్సార్ ఉన్నాయి. AI ఆధారిత ఫీచర్ల మద్దతుతో ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో కనెక్టివిటీ

రెడ్‌మి నోట్ 9 ప్రో కనెక్టివిటీ

స్టోరేజ్ పరంగా రెడ్‌మి నోట్ 9 ప్రో 128GB వరకు UFS 2.1 స్టోరేజ్ ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ప్రత్యేక స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, NavIC, USB Type-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ సెన్సార్‌తో వస్తుంది మరియు బాటమ్-ఫైరింగ్ స్పీకర్లతో పాటు శబ్దం రద్దు మద్దతుతో డ్యూయల్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Redmi Note 9 Pro, Redmi Note 9 Pro Max Launched in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X