Home
Mobile

షియోమి ఫోన్ పేలుడు కలకలం, వరుసగా ఇది మూడోసారి..

చైనా కంపెనీ షియోమికి చెందిన రెడ్‌మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. మొన్న విశాఖ, నిన్న విజయవాడ, బెంగళూరు... నేడు తెలంగాణలోని శంషాబాద్.

By Hazarath Aiah

మొన్న విశాఖ, నిన్న విజయవాడ, బెంగళూరు... నేడు తెలంగాణలోని శంషాబాద్. ఇలా చైనా కంపెనీ షియోమికి చెందిన రెడ్‌మీ ఫోన్ల పేలుడు పరంపర కొనసాగుతోంది. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, శంషాబాద్ కు చెందిన చిట్టిబాబు అనే యువకుడు ఇటీవలే 'రెడ్ మీ 4 ఏ' స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. అతను కూరగాయల మార్కెట్ లో ఉన్న వేళ, సెల్ ఫోన్ రింగ్ అయింది. బయటకు తీస్తుంటే ఫోన్ నుంచి పొగలు వస్తూ కనిపించడంతో, దాన్ని కింద పడేశాడు. చూస్తుండగానే అది పేలిపోయింది. ఈ ఘటనపై కంపెనీకి ఫిర్యాదు చేసిన చిట్టిబాబు, అది జేబులో పేలుంటే తన ప్రాణాలు పోయుండేవని వాపోయాడు.

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఘటన

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఘటన

ఇది వరకు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన కిరణ్ సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్ పై తన దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి. అతనికి గాయాలయ్యాయి.

బెంగళూరు ఘటన

బెంగళూరు ఘటన

బెంగళూరుకు చెందిన అర్జున్‌ గతంలో పూర్వికా స్టోర్‌లో రెడ్‌మి నోట్‌4 మొబైల్‌ను కొనుగోలు చేశాడు. అది ఈ నెల 17న ఇంట్లో మంటలు రావడంతో కాలిపోయిందని కంపెనీ తెలిపింది. అదే రోజు సదరు వినియోగదారుడికి కాలిపోయిన ఫోన్‌కు బదులుగా కొత్త ఫోన్‌ను పంపించామని సంస్థ పేర్కొంది.

షియోమి స్పందిస్తూ

షియోమి స్పందిస్తూ

దీనిపై షియోమి స్పందిస్తూ రెడ్‌మి నోట్‌4 పేలినట్లు చూపిస్తున్న వీడియో నోట్‌4 ఫోన్‌కు సంబంధించింది కాదని, ఈ విషయాన్ని వినియోగదారులు గుర్తించాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు

ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు

ఈ నేపథ్యంలో ఫోన్ పేలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను ప్రోత్సహించకండి.మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకండి. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడొద్దు. దెబ్బతిన్న బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

overheat’

overheat’

ఫోన్‌లో అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్‌ను తగ్గించుకోవచ్చు.

ఇంటర్నెట్‌ను బ్రౌజ్

ఇంటర్నెట్‌ను బ్రౌజ్

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌

బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌

ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లను

కనెక్టువిటీ ఫీచర్లను

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి. వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

చార్జ్ అవుతోన్న సమయంలో

చార్జ్ అవుతోన్న సమయంలో

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

ఎక్కువ సేపే గేమ్స్

ఎక్కువ సేపే గేమ్స్

ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Redmi 4A phone blast in Shamshabad of Hyderabad More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X