రెడ్‌మి ఫోన్ల‌లో ఈ ఫీచర్లు ఎప్పుడైనా టచ్ చేశారా ?

గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్తదనాన్ని చూపిస్తూనే ఉంది.

|

గ్లోబల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్తదనాన్ని చూపిస్తూనే ఉంది. కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి సరికొత్త ఫోన్లను తీసుకువస్తూనే ఉంది. ఇండియా మార్కెట్లో సింహభాగం రెడ్ మి ఫోన్లదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే రెడ్‌మి ఫోన్లలో మీరు ఫీచర్లను గమనించే ఉంటారు. అయితే అన్ని ఫీచర్లను గమనించారా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. చాలలామంది యూజర్లు సాధారణ ఫీచర్లనే వాడుతున్నారు. ఫోన్ ఫీచర్లను సమర్థవంతంగా వినియోగించుకునే వారు తక్కువ. ఈ శీర్షికలో భాగంగా మీకు అలాంటి కొన్ని ఫీచర్లను అందిస్తున్నాం. ఓ సారి చెక్ చేసుకోండి.

15 ఏళ్ల Airtel సామ్రాజ్యం కుప్పకూలింది15 ఏళ్ల Airtel సామ్రాజ్యం కుప్పకూలింది

సెక్యూరిటీ లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్స్‌

సెక్యూరిటీ లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్స్‌

రెడ్‌మి ఫోన్లలో 4 రకాల సెక్యూరిటీ లాక్‌ స్క్రీన్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. పిన్‌, ప్యాట్రన్‌‌, పాస్‌వర్డ్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌ ద్వారా ఫోన్‌ను లాక్‌ చేసేందుకు వీలుంది. దీని కోసం సెట్టింగ్స్‌లో ‘లాక్‌ స్క్రీన్-పాస్‌వర్డ్‌' క్లిక్ చేసి, సెట్‌ స్క్రీన్‌ లాక్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మనకు కావాల్సిన సెక్యూరిటీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఫేస్‌ అన్‌లాక్‌ సదుపాయం

ఫేస్‌ అన్‌లాక్‌ సదుపాయం

కొత్తగా వచ్చిన రెడ్‌మి ఫోన్లలో ఫేస్‌ అన్‌లాక్‌ సదుపాయం కూడా ఇచ్చారు. ఈ ఆప్షన్‌లోకి వెళ్తే ముందువైపు కెమెరా మీ ఫేస్‌ను స్కాన్‌ చేసి డేటాను భద్రపరుచుకుంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా అన్‌లాక్‌ చేయాల్సి వచ్చినప్పుడు పవర్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి. స్క్రీన్‌ వేకప్‌ అవ్వగానే ముందువైపు కెమెరా మీ ముఖాన్ని రీడ్‌ చేసి, ఫోన్‌ను అన్‌లాక్‌ చేస్తుంది.

విడ్జెట్‌

విడ్జెట్‌

అతి ముఖ్యమైన సమాచారాన్ని ఒకేసారి, హోం స్క్రీన్‌ మీదనే చూడాలనుకునేవారికి విడ్జెట్స్‌ సరైన మార్గం.యాప్‌ పూర్తిగా ఓపెన్‌ కాకుండానే మనకు అవసరమైన విషయాన్ని చిన్న ఐకాన్‌ సాయంతో విడ్జెట్స్‌ చూపిస్తాయి. వీటిని హోం స్క్రీన్‌పై ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

 జరగబోయే ఈవెంట్స్‌

జరగబోయే ఈవెంట్స్‌

జరగబోయే ఈవెంట్స్‌, ఈమెయిల్స్, న్యూస్‌, వాతావరణం తదితర విషయాలను ఒకే ఒక్క క్లిక్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం హోమ్‌ స్క్రీన్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే...మెనూ కింది భాగంలో విడ్జెట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేస్తే ఐకాన్స్‌ కొన్ని కనిపిస్తాయి. వీటిలో మనం కోరుకున్న దానిని డ్రాగ్‌ చేసి హోం స్క్రీన్‌ మీదికి తెచ్చుకోవచ్చు.

ఓకే గూగుల్‌

ఓకే గూగుల్‌

రోజుకు సంబంధించిన ముఖ్యమైన వార్తలను వినాలనుకున్నా,ఒకసారి ఏదైనా విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పాలన్నా,గూగుల్‌ మ్యాప్స్‌, వెబ్‌సైట్లలను ఓపెన్ చేయాలన్నా ఈ ఓకే గూగుల్‌ ద్వారా చేయవచ్చు.

 యాక్టివేట్‌ చేసుకునేందుకు

యాక్టివేట్‌ చేసుకునేందుకు

ఈ ఫీచర్‌ని యాక్టివేట్‌ చేసుకునేందుకు ముందుగా గూగుల్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. అక్కడ ‘ఓకే గూగుల్‌' యాక్టివేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి, వాయిస్‌ బటన్‌ను క్లిక్‌ చేసి, ‘మ్యాచ్‌ విత్‌ మై వాయిస్‌'ను యాక్టివేట్‌ చేయాలి. అనంతరం ‘ఓకే గూగుల్‌' అని నాలుగు సార్లు చెప్పాలి. అప్పుడు మీ వాయిస్‌ను గూగుల్‌ సేవ్‌ చేసుకుంటుంది.

హోం’ బటన్‌ లేదా హోం స్క్రీన్‌పై

హోం’ బటన్‌ లేదా హోం స్క్రీన్‌పై

ఆ తర్వాత ఎప్పుడైనా అవసరమైతే మీరు ‘ఓకే గూగుల్‌' అంటే ఈ సర్వీసు యాక్టివేట్‌ అవుతుంది. లేదంటే ‘హోం' బటన్‌ లేదా హోం స్క్రీన్‌పై ఉన్న వాయిస్‌ గుర్తును లాంగ్‌ ప్రెస్‌ చేసి ‘ఓకే గూగుల్‌' అని చెప్పాలి. అనంతరం గూగుల్‌ మనకు సాయం చేస్తుంది.

ఫ్లాష్‌ లైట్‌

ఫ్లాష్‌ లైట్‌

ఫ్లాష్‌ లైట్‌ కోసం కొన్ని ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో ప్రత్యేకంగా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునే అవసరం లేకుండానే ఇందులో ఇన్‌బిల్ట్‌గానే ఫ్లాష్‌ లైట్‌ ఐకాన్‌ ఉంది. నోటిఫికేషన్‌ బార్‌లో ఫ్లాష్‌ లైట్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేసి, లైట్‌ను ఆన్‌ చేసుకోవచ్చు. లైట్‌ను ఆఫ్‌ చేసుకోవాలంటే తిరిగి నోటిఫికేషన్‌ బార్‌ వరకు వెళ్లక్కర్లేదు. పవర్‌ బటన్‌ను డబుల్‌ క్లిక్‌ చేస్తే లైట్‌ ఆగిపోతుంది. అంతేకాదు, అడిషనల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, బటన్‌ అండ్‌ గెస్చర్స్‌ షార్ట్‌కట్‌ను క్లిక్‌ చేసి, టార్చ్‌లైట్‌కు షార్ట్‌కట్‌ పెట్టుకోవచ్చు.

డేటా యూసేజ్‌

డేటా యూసేజ్‌

సెక్యూరిటీ యాప్‌ను క్లిక్‌ చేసి డేటా యూసేజ్‌కు ఎంచుకొని మన డేటా వివరాలు తెలుసుకోవచ్చు.

డెవలపర్‌ ఆప్షన్‌

డెవలపర్‌ ఆప్షన్‌

మొబైల్‌ కాస్త వేగంగా రెస్పాండ్‌ కావాలంటే సెట్టింగ్స్‌లోని ‘అబౌట్‌ ఫోన్‌''లోకి వెళ్లి అందులో ‘ఎమ్‌ఐయూఐ వెర్షన్' మీద 5 నుంచి 7సార్లు క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లో డెవలపర్‌ ఆప్షన్‌ యాక్టివేట్‌ అవుతుంది. తర్వాత సెట్టింగ్స్‌లోని అడిషనల్‌ సెట్టింగ్స్‌ని సెలెక్ట్ చేసుకొని డెవలపర్‌ ఆప్షన్స్‌ని పొందవచ్చు.

క్విక్‌ సెట్టింగ్స్‌

క్విక్‌ సెట్టింగ్స్‌

నోటిఫికేషన్‌ బార్‌ను కిందికి డ్రాగ్‌ చేస్తే క్విక్‌ సెట్టింగ్స్‌ బటన్స్‌ (టాగుల్స్‌) కనిపిస్తాయి. అయితే రెడ్‌మి ఫోన్లలో రెండుసార్లు డ్రాగ్‌ చేయాల్సి ఉంటుంది. తొలిసారి స్వైప్‌ చేస్తే నాలుగు లేదా ఐదు ఐకాన్స్‌, మరోసారి స్వైప్‌ చేస్తే మొత్తం 11 క్విక్‌ సెట్టింగ్స్‌ డిస్‌ప్లే అవుతాయి. ఆ 11 ఏవి ఉండాలో అనే దాని కోసం నోటిఫికేషన్‌ ప్యానల్‌లో ఆఖరున ఉన్న ‘సార్ట్'‌ బటన్‌ను క్లిక్‌ చేయడం ద్వారా మనకు కావాల్సిన క్విక్‌సెట్టింగ్స్‌ను పైకి తీసుకురావచ్చు.

రీడింగ్‌మోడ్‌

రీడింగ్‌మోడ్‌

రీడింగ్‌ మోడ్‌ యాక్టివేట్‌ చేసుకుంటే స్క్రీన్‌ మొత్తం లేత నీలం రంగు నుంచి లేత గోధుమ రంగులోకి మారుతుంది. ఈ ఫీచ్ ద్వారా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకోవడానికి సెట్టింగ్స్‌లోకి వెళ్లి, డిస్‌ప్లే సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ‘రీడింగ్‌ మోడ్' పక్కగానున్న బ్లూ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి.‌

స్క్రీన్‌షాట్‌

స్క్రీన్‌షాట్‌

మనం స్క్రీన్‌ షాట్‌ తీయాలనుకుంటున్న పేజీని ఓపెన్‌ చేసి కేవలం మూడు వేళ్లతో కిందికి డ్రాగ్‌ చేస్తే చాలు.. స్క్రీన్‌షాట్‌ వచ్చేస్తుంది. మామూలుగా స్క్రీన్‌ షాట్‌ తీస్తే స్క్రీన్‌ మీద కనిపించేంత వరకే ఇమేజ్‌గా సేవ్‌ అవుతుంది. రెడ్‌ మీలో స్క్రోల్‌ ఆప్షన్‌ ఇచ్చారు. దీని వల్ల స్క్రీన్ షాట్‌ను ఎక్స్‌పాండ్‌ చేసుకోవచ్చు. ఒక స్క్రీన్‌ షాట్‌ తీసిన తర్వాత దిగువన స్క్రోల్‌ అని ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే పేజీ మొత్తం స్క్రీన్‌షాట్‌ తీసుకుంటుంది. అక్కడ మనకు ఎంత కావాలో అంత సెలక్ట్‌ చేసుకునే ఆప్షన్‌ ఉంది.

స్ప్లిట్‌ స్క్రీన్‌..

స్ప్లిట్‌ స్క్రీన్‌..

ఒకే స్క్రీన్‌పై రెండు ఆప్‌లను చూడొచ్చు. దీనికోసం రీసెంట్స్‌ ఓపెన్‌ చేయాలి. అప్పుడు మనం రీసెంట్‌గా ఓపెన్‌ చేసిన యాప్‌లు కనిపిస్తాయి. దీని పైభాగంలో ‘స్ప్లిట్‌ స్క్రీన్‌' ఆప్షన్‌ ఉంటుంది. మనకు కావాల్సిన ఆప్‌ను దానిపైకి డ్రాగ్‌ చేస్తే ఆ యాప్‌ స్క్రీన్‌ పై భాగంలో ఓపెన్‌ అవుతుంది. ఆ తర్వాత క్లిక్‌ చేసిన యాప్‌ దిగువ భాగంలో ఓపెన్‌ అవుతుంది. అలా రెండు ఒకేసారి ఓపెన్‌ చేసుకోవచ్చు. పైన ఉన్న యాప్‌ను దిగువకు మార్చాలంటే మధ్యలో ఉన్న అడ్డ గీతపై డబుల్‌ క్లిక్‌ చేస్తే మారిపోతుంది.

Best Mobiles in India

English summary
6 Reasons Why You Can’t Ignore A Redmi Phone In Today’s World more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X