షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ నేడే లాంచ్, బడ్జెట్ ధర, అదిరే ఫీచర్లు

|

రెడ్‌మి సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనీస్‌ మొబైల్స్‌ దిగ్గజం షియోమి నేడు లాంచ్‌ చేస్తోంది. మరికొన్ని గంటల్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి ఎస్‌2ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కాగా రెడ్‌మి సిరీస్‌లో బెస్ట్‌ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌గా ఇది వినియోగదారుల ముందుకు వస్తోంది. కాగా చైనా, భారత మార్కెట్లను టార్గెట్‌గా చేసుకుని షియోమి ఈ స్మార్ట్‌ఫోన్‌ను తన స్వదేశంలో ప్రవేశపెడుతోంది. లాంచ్‌ ఈవెంట్‌ చైనాలో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది.

 
షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ నేడే లాంచ్, బడ్జెట్ ధర, అదిరే ఫీచర్లు

గత కొన్ని వారాలుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, స్పెషిషికేషన్లు, డిజైన్‌, ఫీచర్లపై పలు లీకేజీలు మార్కెట్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.చైనాలో లాంచ్ అయిన తరువాత ఇది ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఇండియాకి రావచ్చని రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ వారంలో లాంచ్ కానున్నటాప్ 7 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు, బెస్ట్ ఫీచర్లపై ఓ లుక్కేయండిఈ వారంలో లాంచ్ కానున్నటాప్ 7 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు, బెస్ట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి

మూడు వేరియంట్లలో

మూడు వేరియంట్లలో

లీకయిన వివరాల ప్రకారం రెడ్‌మి ఎస్‌2 మూడు వేరియంట్లలో రాబోతున్నట్టు తెలుస్తోంది..ఒకటి 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ దీని ధర సీఎన్‌వై 1000(సుమారు రూ.10,500) కంటే తక్కువగా ఉండబోతోందని సమాచారం.

ధర

ధర

మరొకటి 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌, దీని ధర 165.99 డాలర్లు అంటే సుమారు రూ.11,100గా ఉండనున్నట్టు తెలుస్తోంది.

4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌

4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌

అదేవిధంగా చివరిది 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. అయితే ఈ టాప్‌ వేరియంట్‌ ధర ఎంత ఉండొచ్చనది ఇంకా క్లారిటీ లేదు.

 షియోమీ రెడ్‌మీ ఎస్2 ఫీచర్లు
 

షియోమీ రెడ్‌మీ ఎస్2 ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఎస్ సీరిస్ లో తొలి ఫోన్

ఎస్ సీరిస్ లో తొలి ఫోన్

కాగా ఈ ఫోన్ ఎస్ సీరిస్ లో తొలి ఫోన్. ఇది కనుక మార్కెట్లో విజయవంతమయితే ఈ సీరిస్ లో మరిన్ని ఫోన్లను కంపెనీ లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే షియోమీ రెడ్‌మీ 3ఎస్ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. దీని ధర రూ. రూ.6,999గా ఉంది.
షియోమీ రెడ్‌మీ 3ఎస్ ఫీచ‌ర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌, అడ్రినో 505 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Best Mobiles in India

English summary
Redmi S2 Launch Today: Specifications, Price, and More You Should Know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X