Home
Mobile

రూ.23 వేలకే 50MP కెమెరా, సూపర్ ఫాస్ట్ ప్రాసెసర్.. రెడ్‌మీ టర్బో 4 లాంచ్..

By Ram Kumar

రెడ్‌మీ ఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి కొత్త మోడల్ ఒక సంచలనమే. ఇండియాలోనూ రెడ్‌మీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు రెడ్‌మీ కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ టర్బో 4 (Redmi Turbo 4)ని చైనా మార్కెట్లో విడుదల చేసింది. దీని ఫీచర్లు, ప్రైసెస్ డీటైల్స్ తెలుసుకుందాం.

ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400-Ultra చిప్‌సెట్‌తో వస్తోంది. ఇందులో 6,550mAh బిగ్ బ్యాటరీ ఉంది, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో క్షణాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ ప్రూఫ్ కోసం IP66, IP68, IP69 రేటింగ్స్‌తో వస్తోంది. అంటే ఎలాంటి వాతావరణంలోనైనా ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. రెడ్‌మీ టర్బో 4లో బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, 1.5K OLED డిస్‌ప్లేతో విజువల్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. వీడియోలు, ఫొటోలు క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయి. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో షియోమీ HyperOS 2.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది, దీంతో స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ.

23                 50MP                                                                                                                            4

రెడ్‌మీ టర్బో 4 ధరలు చూస్తే, ఇది డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌లో లభిస్తుంది. బేసిక్ మోడల్ అంటే 12GB RAM + 256GB స్టోరేజ్‌తో ఉన్న వేరియంట్ ధర 1,999 చైనీస్ యువాన్లు (దాదాపు రూ.23,500) నుంచి స్టార్ట్ అవుతుంది. 16GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర 2,199 యువాన్లు (దాదాపు రూ.25,800). ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వాళ్ల కోసం మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి 12GB RAM + 512GB స్టోరేజ్: 2,299 యువాన్లు (దాదాపు రూ.27,000), 16GB RAM + 512GB స్టోరేజ్: 2,499 యువాన్లు (దాదాపు రూ.29,400). ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనాలో షియోమీ అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్లో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే, ఇప్పుడే చైనా మార్కెట్లో లాంచ్ అయింది. త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి కూడా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కస్టమర్ల కోసం లక్కీ క్లౌడ్ వైట్, షాడో బ్లాక్.. షాలో సీ బ్లూ వంటి మూడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

* స్పెసిఫికేషన్లు

రెడ్‌మీ రెడ్‌మీ 4లో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. దీని 1.5K (1,220 x 2,712 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో పిక్చర్స్ క్రిస్టల్ క్లియర్‌గా, షార్ప్‌గా ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌ స్క్రోలింగ్, యానిమేషన్స్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇంకా 1,920Hz PWM డిమ్మింగ్, 2,560Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉన్నాయి. దీనివల్ల కళ్లు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి.

టచ్‌కు లైట్నింగ్ ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే అల్ట్రా బ్రైట్, గరిష్టంగా 3,200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది, అంటే డైరెక్ట్ సన్‌లైట్‌లోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉండటం వల్ల స్క్రాచెస్ గురించి టెన్షన్ ఉండదు. HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉండటం వల్ల వీడియోలు చూసే ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. రెడ్‌మీ Turbo 4లో పవర్‌ఫుల్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8400-Ultra చిప్‌సెట్, Mali-G720 MC6 GPU ఉన్నాయి. అంటే హెవీ గేమ్స్ ఆడినా ఎలాంటి లాగ్ ఉండదు. ఇందులో 16GB వరకు లేటెస్ట్ LPDDR5X RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్ ఉన్నాయి.

* కెమెరా సెటప్

వెనుకవైపు 50MP సోనీ LYT-600 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20MP కెమెరా ఉంది. స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ దీని సొంతం. లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ 5G, Wi-Fi 6, బ్లూటూత్ 6.0, GPS, NFC, USB Type-C పోర్ట్ అన్నీ ఉన్నాయి. దీని సైజు 160.95 x 75.24 x 8.06mm, వెయిట్ 203.5 గ్రాములు.

More from GizBot

Best Mobiles in India

English summary
The Redmi Turbo 4, featuring the MediaTek Dimensity 8400-Ultra chipset, 6,550mAh battery, 50MP dual cameras, and a 1.5K OLED display, offers top-notch performance, durability, and features at competitive pricing.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X