Home
Mobile

7,550mAh బ్యాటరీ, 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4తో Redmi Turbo 4 Pro వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!

Redmi Turbo 4 Pro Launch: టెక్నాలజీ ప్రియులకు షియోమీ (Xiaomi) గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా చైనా మార్కెట్‌లో సరికొత్త రెడ్‌మీ టర్బో 4 ప్రో (Redmi Turbo 4 Pro) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో అమర్చిన 7,550mAh భారీ బ్యాటరీ, సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఫోన్‌ను పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

ఈ ఫోన్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ హ్యారీ పోటర్ ఎడిషన్ (Harry Potter edition). ఇది ప్రత్యేకమైన డిజైన్, కస్టమ్ థీమ్స్, ప్రత్యేక ప్యాకేజింగ్‌తో వస్తుంది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్, త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లోకి రానుంది. బహుశా భారతదేశంలో ఇది పోకో ఎఫ్7 (POCO F7) పేరుతో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి.

Redmi Turbo 4 Pro Launched

* డిస్‌ప్లే, డిజైన్, మన్నిక
రెడ్‌మీ టర్బో 4 ప్రో స్మార్ట్‌ఫోన్.. పెద్ద 6.83-అంగుళాల అమోలెడ్ (OLED) డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1.5K (2800x1280 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో చాలా స్పష్టంగా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. అంతేకాదు, ఏకంగా 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటం విశేషం.

డాల్బీ విజన్ (Dolby Vision) సపోర్ట్, కళ్ల రక్షణ కోసం 3,840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ స్క్రీన్ చుట్టూ చాలా సన్నని బెజెల్స్, కింద భాగంలో చిన్న గడ్డం (చిన్) ఉండటంతో స్క్రీన్ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఫోన్ మధ్య ఫ్రేమ్‌ను CNC మెషిన్‌తో మెటల్‌తో తయారుచేశారు.

ఏవియేషన్-గ్రేడ్ అల్యూమినియం వాడటంతో ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది. ఇది కేవలం 7.98mm మందంతో స్లిమ్‌గా ఉన్నా, 70 కిలోల బరువు వరకు వంగకుండా తట్టుకోగలదు. దీనికి దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ట్రిపుల్ సర్టిఫికేషన్స్ (IP66, IP68, IP69) ఉన్నాయి. అంటే నీటిలో పడినా, దుమ్ము పడినా పెద్దగా భయపడాల్సిన పనిలేదు.

* పనితీరు, సాఫ్ట్‌వేర్
ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 (Snapdragon 8s Gen 4) చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 4nm ప్రాసెస్‌పై తయారైంది, అడ్రినో 825 GPU (Adreno 825 GPU) గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం గరిష్టంగా 16GB LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లున్నాయి.

ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు డ్యూయల్-లూప్ 3D ఐస్ కూలింగ్ టెక్నాలజీ, మెరుగైన పనితీరు కోసం రేజ్ ఇంజిన్ 4.0 (Rage Engine 4.0) కూడా ఇందులో ఉపయోగించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత షియోమీ హైపర్ఓఎస్ 2 (HyperOS 2) తో పనిచేస్తుంది.

* కెమెరాలు, ఇతర ఫీచర్లు
కెమెరా విషయానికొస్తే, టర్బో 4 ప్రో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT-600 (Sony LYT-600) మెయిన్ సెన్సార్ (OIS, EIS సపోర్ట్‌తో) ఒకటి కాగా, రెండోది 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా. సెల్ఫీల కోసం ముందువైపు 20MP కెమెరా అమర్చారు.

వెనుక కెమెరాతో 4K 60fps వరకు, ముందు కెమెరాతో 1080p 60fps వరకు వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇతర ఫీచర్లలో స్క్రీన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, ఇన్‌ఫ్రారెడ్ (IR) రిమోట్ కంట్రోల్, NFC, USB టైప్-సి ఆడియో వంటివి ఉన్నాయి.

* బ్యాటరీ, ఛార్జింగ్
ఈ ఫోన్‌కు అతిపెద్ద హైలైట్లలో ఒకటి దీని భారీ 7,550mAh బ్యాటరీ. ఇది 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి, వేగవంతమైన ఛార్జింగ్ కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఆప్షన్ అని షియోమీ చెబుతోంది.

* కనెక్టివిటీ, నావిగేషన్
ఇందులో 5G (SA/NSA), డ్యూయల్ 4G VoLTE, వై-ఫై 6 (Wi-Fi 6), బ్లూటూత్ 5.4 (Bluetooth 5.4), GPS (L1+L5), గెలీలియో (Galileo), గ్లోనాస్ (GLONASS), నావిక్ (NavIC), QZSS వంటి అన్ని లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లున్నాయి. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. కచ్చితమైన లొకేషన్ కోసం అధునాతన నావిగేషన్ సపోర్ట్‌తో వస్తుంది.

* ధర, వేరియంట్లు
రెడ్‌మీ టర్బో 4 ప్రో నలుపు (Black), తెలుపు (White), ఆకుపచ్చ (Green) వంటి మూడు రంగులలో లభిస్తుంది. చైనాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లు (సుమారు రూ.25,700)గా నిర్ణయించారు.

16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 (సుమారు రూ.26,900) యువాన్లు, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 (సుమారు రూ.29,300) యువాన్లు, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,699 (సుమారు రూ.31,600) యువాన్లు.

16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ.35,100)గా ప్రకటించారు. ఇక ప్రత్యేక హ్యారీ పోటర్ లిమిటెడ్ ఎడిషన్ (Harry Potter Limited Edition) విషయానికొస్తే, ఇది 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర 2,799 యువాన్లు (సుమారు రూ 32,800). ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ప్రత్యేకమైన హ్యారీ పోటర్ థీమ్ డిజైన్, కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI), ఆకర్షణీయమైన హ్యారీ పోటర్ గిఫ్ట్ బాక్స్‌తో వస్తుంది.

Best Mobiles in India

English summary
Redmi Turbo 4 Pro Launched: Snapdragon 8s Gen 4, Massive 7550mAh Battery, Full Specs and Price Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X