Home
Mobile

16GB RAM, 7550mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో వచ్చేస్తున్న Redmi Turbo 4 Pro..!

REDMI Turbo 4 Pro: షియోమీ (Xiaomi) తన సరికొత్త పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్, రెడ్‌మీ టర్బో 4 ప్రో (REDMI Turbo 4 Pro)ను ఏప్రిల్ 24న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. క్వాల్‌కామ్ (Qualcomm) వారి లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 (Snapdragon 8s Gen 4) చిప్‌సెట్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం.

ఈ ప్రాసెసర్ 4nm టెక్నాలజీతో తయారైంది. మధ్యస్థాయి-ప్రీమియం ఫోన్ల విభాగంలో పనితీరులో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని రెడ్‌మీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన రెడ్‌మీ టర్బో 4 కి కొనసాగింపుగా వస్తున్న ఈ ప్రో మోడల్, డిజైన్, స్పెసిఫికేషన్లలో భారీ మార్పులతో రానుంది.

Redmi Turbo 4 Pro Launching April 24 First with Snapdragon 8s Gen 4  7550mAh Battery  amp amp  90W Charging

* ప్రీమియం డిజైన్, చూడగానే వావ్ అనిపించేలా..

రెడ్‌మీ టర్బో 4 ప్రో డిజైన్ విషయంలో కంపెనీ ఏమాత్రం రాజీ పడలేదు. ముందు వైపు స్టైలిష్ పెద్ద R-యాంగిల్ డిజైన్, స్క్రీన్ చుట్టూ చాలా పలుచని అంచులు (bezels), వెనుకవైపు మృదువైన గ్లాస్ బాడీ దీనికి ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తున్నాయి.

అంతేకాకుండా, ఈ ధరల శ్రేణిలో సాధారణంగా కనిపించే ప్లాస్టిక్ ఫ్రేమ్‌లకు బదులుగా, ఖరీదైన ఫోన్లలో ఉండే మెటల్ ఫ్రేమ్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది ఫోన్‌కు మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తుందని రెడ్‌మీ చెబుతోంది. ఈ ఫోన్ తెలుపు, ఆకుపచ్చ, నలుపు అనే మూడు అద్భుతమైన రంగులలో లభిస్తుందని రెడ్‌మీ చైనా హెడ్ థామస్ వాంగ్ (Thomas Wang) తెలిపారు.

* అద్భుతమైన డిస్‌ప్లే, అదిరిపోయే పనితీరు..

ఈ స్మార్ట్‌ఫోన్ నాణ్యత సుమారు 5,000 యువాన్ల (చైనా కరెన్సీ) ధర కలిగిన ఫోన్లతో సులభంగా పోటీ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోన్ ముఖ్య ఆకర్షణలలో ఒకటి దాని డిస్‌ప్లే. 6.83-అంగుళాల భారీ OLED స్క్రీన్, 1.5K లేదా బహుశా 2.5K రిజల్యూషన్‌తో వస్తుంది.

దీనికి తోడు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ వంటివి స్మూత్‌గా ఉంటాయి. ఇక పనితీరు విషయానికొస్తే, కొత్త స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ (3.2GHz వరకు క్లాక్ స్పీడ్), అడ్రినో 825 GPU లతో వస్తుంది. ఇది పాత మోడల్ కంటే 31% ఎక్కువ వేగాన్ని అందిస్తుందని అంచనా.

వినియోగదారులు 12GB లేదా 16GB LPDDR5X RAM వేరియంట్లను ఎంచుకోవచ్చు. అలాగే, స్టోరేజ్ ఆప్షన్లు 256GB, 512GB, లేదా ఏకంగా 1TB వరకు ఉన్నాయి. అన్నీ కూడా వేగవంతమైన UFS 4.0 టెక్నాలజీతో పనిచేస్తాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత షియోమీ హైపర్OS 2 (HyperOS 2)తో పనిచేస్తుంది.

* కెమెరా, ఇతర ఫీచర్లు

ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం, వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా (OIS, EIS సపోర్ట్‌తో, అంటే ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా ఉంటాయి), 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. దీనితో 4K వీడియోలను సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద రికార్డ్ చేయవచ్చు.

ముందువైపు, నాణ్యమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20MP కెమెరా (f/2.2 అపెర్చర్‌తో) అమర్చారు. అదనంగా, స్టీరియో స్పీకర్లు, USB టైప్-సి ఆడియో, స్క్రీన్‌లోనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టీవీ/ఏసీలను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

* భారీ బ్యాటరీ, అద్భుతమైన మన్నిక

రెడ్‌మీ ఈ ఫోన్‌లో ఏకంగా 7,550mAh భారీ బ్యాటరీని అందిస్తోంది దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. మన్నిక విషయంలోనూ ఇది టాప్ క్లాస్‌లోనే ఉంది. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉన్నాయి.

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా, ఫోన్ బరువు 219 గ్రాములు, మందం 7.98mmగా ఉండటం విశేషం. ఇది చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. కనెక్టివిటీ పరంగా, ఈ ఫోన్ 5G SA/NSA, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, డ్యూయల్ 4G VoLTE, NFC, GPS, USB టైప్-సి వంటి అన్ని ఆధునిక సదుపాయాలను కలిగి ఉంది.

తరచూ ప్రయాణించే వారి కోసం, భారతదేశపు NavICతో సహా గ్లోబల్ శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్స్ అయిన గెలీలియో, గ్లోనాస్, QZSSలకు కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఇన్ని అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న అందిని ధర ఎంత అనుకుంటున్నారు, గ్లోబల్ వేరియంట్, ధర అంచనాలు కింద తెలుసుకుందాం.

* ధర

రెడ్‌మీ టర్బో 4 ప్రో గ్లోబల్ మార్కెట్లలో పోకో F7 (Poco F7) పేరుతో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు, అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పోలిక కోసం చూస్తే, సాధారణ రెడ్‌మీ టర్బో 4 జనవరిలో చైనాలో 12GB + 256GB మోడల్ ప్రారంభ ధర 1,999 యువాన్లు (సుమారు రూ.23,500)తో వచ్చింది.

ప్రో వెర్షన్‌లోని అదనపు ఫీచర్లు, మెరుగైన స్పెసిఫికేషన్ల కారణంగా, దీని ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినా, ఇది తన విభాగంలో అత్యంత పోటీ ధరకే లభిస్తుందని భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi Turbo 4 Pro Launching April 24 First with Snapdragon 8s Gen 4, 7550mAh Battery & 90W Charging
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X