మళ్లీ 3 నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్, షియోమి ఫోన్లకు ఇంత క్రేజా..?

Written By:

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ వై1, రెడ్‌మీ వై1 లైట్‌ ఫ్లాష్ సేల్ దుమ్మురేపింది. ఈ రోజు అవి అమ్మకానికి రాగా కేవలం మూడు నిమిషాల్లోనే అవి అమ్ముడుపోయాయి. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఫ్లాష్ సేల్ నిర్వహించగా రెండు ఫోన్లు కలిపి ఏకంగా 1.50 లక్షల యూనిట్లు కేవలం 3 నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని షియోమీ ఇండియా ఎండీ మను జైన్ వెల్లడించారు.

జియో దెబ్బకు విలవిల, భారీగా నష్టపోయిన దేశీయ కంపెనీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Redmi Y1 ఫీచర్లు

మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ వై1 లైట్ ఫీచర్లు...

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

తదుపరి సేల్ ఈ నెల 15..

ఈ ఫోన్లకు గాను తదుపరి సేల్ ఈ నెల 15వ తేదీన జరగనుంది. కాగా షియోమీ రెడ్‌మీ వై1 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.8,999, రూ.10,999 ధరలకు లభిస్తుండగా, రెడ్‌మీ వై1 లైట్ రూ.6,999 ధరకు లభిస్తున్నది.

కెమెరా క్వాలిటీ కేక...

Redmi Y1 స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ పోర్షన్‌లో అమర్చిన 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ అత్యుత్తమంగా రెస్పాండ్ అవుతోంది. ఈ కెమెరాతో చిత్రీకరించిన షాట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ కెమెరా రెడ్‌మి 4ఏ కెమెరాను తలపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, Redmi Y1 స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరాలు స్థాయికి తగ్గ పనితీరును కనబరుస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Redmi Y1, Redmi Y1 Lite Sold Over 150,000 Units in 3 Minutes in First Sale: Xiaomi more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot