స్టన్నింగ్ ఫీచర్లతో షియోమి Redmi Y2, రూ.9999కే 3జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షియోమి’ తాజాగా ‘రెడ్‌మి వై2’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

|

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ 'షియోమి' తాజాగా 'రెడ్‌మి వై2' పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.ఇందులో 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.9,999గా, 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.12,999గా ఉంది. అమెజాన్‌ సహా తమ సొంత వెబ్‌ పోర్టల్‌ ఎంఐ.కామ్, అలాగే ఎంఐ హోమ్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు జూన్‌ 12 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా ఈ ఫోన్ అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువచ్చింది.

 

Airtel TV మరో ఆరు నెలల పాటు ఉచితం, బెస్ట్ ప్లాన్లు ఇవేAirtel TV మరో ఆరు నెలల పాటు ఉచితం, బెస్ట్ ప్లాన్లు ఇవే

సమర్థవంతమైన అనుభూతి

సమర్థవంతమైన అనుభూతి

వై2 ఫోన్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గతేడాది దూసుకువచ్చిన తొలి సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌ వై1 కన్నా ఈ ఫోన్ చాలా సమర్థవంతమైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

లాంచింగ్‌ ఆఫర్లు:

లాంచింగ్‌ ఆఫర్లు:

ఈ ఫోన్‌పై ఎయిర్ టెల్ రూ.1800 ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్న‌ది. దీంతోపాటు 240 జీబీ మొబైల్ డేటాను ఉచితంగా అందిస్తున్న‌ది. అలాగే ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఫోన్‌ను కొంటే మ‌రో రూ.500 అద‌న‌పు డిస్కౌంట్ ఇస్తారు.

షియోమీ రెడ్‌మీ వై2 ఫీచ‌ర్లు...
 

షియోమీ రెడ్‌మీ వై2 ఫీచ‌ర్లు...

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

5.99 ఇంచుల భారీ డిస్‌ప్లే

5.99 ఇంచుల భారీ డిస్‌ప్లే

ఈ ఫోన్‌లో 5.99 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాల‌ను అమ‌ర్చారు. అలాగే ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేయ‌గా దీనికి ఫ్లాష్, ఫేస్ అన్‌లాక్ స‌దుపాయాల‌ను అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్ర‌త్యేకంగా డెడికేటెడ్ స్లాట్‌ను ఏర్పాటు చేశారు.

రెడ్‌మీ వై1 కంటే ..

రెడ్‌మీ వై1 కంటే ..

గోల్డ్, డార్క్ గ్రే , రోజ్ గోల్డ్ కలర్స్‌లో ఈ డివైస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. రెడ్‌మీ వై1 కంటే ఫేస్‌అన్‌లాక్‌ మోడ్‌, మియూఐ 9.5 అప్‌డేట్‌ ఫీచర్లతో 37 శాతం మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. వై2 కి బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

మేడిన్‌ ఇండియా ఫోన్లలో..

మేడిన్‌ ఇండియా ఫోన్లలో..

మేడిన్‌ ఇండియా ఫోన్లలో ఈ ఏడాది మూడో త్రైమాసికానికల్లా స్థానికంగా తయారు చేసిన సర్క్యూట్‌ బోర్డులనే (పీసీబీ) వాడతామని షియోమి పేర్కొంది. కంపెనీ భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోందని షియోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ తెలిపారు

ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో ..

ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో ..

కాగా షియోమి ఇటీవల ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో శ్రీపెరుంబుదూర్‌లో కొత్త పీసీబీ (మొబైల్‌ ఫోన్‌ మదర్‌బోర్డ్‌) యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్‌ తయారీ వ్యయంలో పీసీబీ వాటానే ఎక్కువ. చాలా కంపెనీలు పీసీబీలను స్థానికంగానే తయారుచేయాలని భావిస్తున్నాయి.

మరో 3 కేంద్రాలు

మరో 3 కేంద్రాలు

కేంద్ర ప్రభుత్వం పలు స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం విధించడం దీనికి కారణమని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కోసం రెండు కేంద్రాలున్న షియోమి ఇటీవలే శ్రీసిటీ (ఆంధ్రప్రదేశ్‌), శ్రీపెరుంబుదూర్‌ (తమిళనాడు)లో మరో 3 కేంద్రాలు ఏర్పాటు చేసింది.

రెడ్‌మీ వై1 ఫీచర్లు

రెడ్‌మీ వై1 ఫీచర్లు

గతేడాది విడుదల చేసిన రెడ్‌మీ వై1 ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి. 

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.8,999, రూ.10,999 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

షియోమీ రెడ్‌మీ వై1 ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Y2, MIUI 10 India launch Highlights: Redmi Y2 price in India starts at Rs 9,999, Amazon sale from June 12

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X