రిలయన్స్ 4జీ వీడియో కాలింగ్ ఫోన్ రూ.3,999కే!

Written By:

రోజుకో సంచలన స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణతో మార్కెట్‌ను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న రిలయన్స్ వరసగా రెండు చౌక ధర 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచింది.

రిలయన్స్ 4జీ వీడియో కాలింగ్  ఫోన్ రూ.3,999కే!

ఈ వారం ఆరంభంలోనే LYF Flame 3 పేరుతో రూ.3,999 ధర ట్యాగ్‌లో ఓ చౌక ధర 4జీ ఫోన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసిన రిలయన్స్ తాజాగా అదే ధర రేంజ్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది. LYF Flame 4 పేరుతో అనౌన్స్ కాబడిన ఈ ఫోన్‌ను లైఫ్ ఫ్లేమ్ 3కి తక్కువ వర్షన్‌గా చెప్పుకోవచ్చు. 4జీ వీడియో కాలింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అడుగుతోన్న షాకింగ్ ప్రశ్నలు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LYF Flame 4 ప్రత్యేకతలు...

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్,

LYF Flame 4 ప్రత్యేకతలు...

4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు.

LYF Flame 4 ప్రత్యేకతలు...

2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

LYF Flame 4 ప్రత్యేకతలు...

ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్,

LYF Flame 4 ప్రత్యేకతలు...

10 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఏర్పాటు 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ  4.5 గంటల టాక్ టైమ్‌ను అందిస్తుంది.

LYF Flame 3 ప్రత్యేకతలు...

 4 అంగుళాల WVGA 480పిక్సల్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,

LYF Flame 3 ప్రత్యేకతలు...

4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించకునే అవకాశం,

LYF Flame 3 ప్రత్యేకతలు...

5 మెగా పిక్సల్ ప్రైమరీ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

LYF Flame 3 ప్రత్యేకతలు...

1,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, డ్యుయల్ సిమ్, జీపీఎస్).

LYF Flame 3 ప్రత్యేకతలు...

VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్ 4జీ నెట్ వర్క్ పై హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. రిలియన్స్ లైఫ్ ఫోన్‌లలో పొందుపరిచిన VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది. 3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

LYF Flame 3 ప్రత్యేకతలు...

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ HomeShop18 ఈ ఫోన్ కు సంబంధించి ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Adds Another Smartphone to 4G Lineup with LYF Flame 4 at Rs 3,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot