రాష్ట్రంలో రిలయన్స్ 3జీ సేవలు!

Posted By:

రాష్ట్రంలో రిలయన్స్ 3జీ సేవలు!

రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తాజాగా 5 సర్కిళ్లలో తమ 3జీ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇంకా తూర్పు ఉత్తర ప్రదేశ్ సర్కిళ్లలో ఈ నెల 20 నుంచి 3జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్‌కామ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో తాము 3జీ సేవలనందిస్తోన్న మొత్తం టెలికాం సర్కిళ్ల సంఖ్య 18కు పెరిగిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సీఈఓ (వినియోగదారుల వ్యాపరం) గుర్దీప్ సింగ్ పేర్కొన్నారు.

తాజా విస్తరణతో 3జీ మార్కెట్లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఆయన అన్నారు. 2 లక్షల కిలోమీటర్ల నాణ్యమైన ఫైబర్ నెట్‌వర్క్‌తో వేగవంతమైన 3జీ సేవలను సమంజసమైన ధరలకే కార్పొరేట్, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థలు ఇంకా వినియోగదారులకు అందిస్తున్నామని గుర్దీప్ సింగ్ తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot