జియో 4జీ ఫోన్ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్

ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు జియో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

|

రిలయన్స్ జియో లాంచ్ చేయబోతోన్న 4జీ ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి గతకొన్ని నెలలుగా అనేక పుకార్లు షికార్లు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ ప్రముఖ వెబ్‌సైట్ ప్రచురించిన కధనం ప్రకారం రూ.1500 జియో 4జీ షీచర్ ఫోన్ త్వరలోనే వాస్తవం కాబోతోంది.

Read More : రిలయన్స్ బంపరాఫర్, రూ.54కే నెలంతా 4జీ, తెలుగు వారికి మాత్రమే ఆఫర్?

చిప్‌సెట్‌ల ధరలు మరింత తగ్గుముఖం..

చిప్‌సెట్‌ల ధరలు మరింత తగ్గుముఖం..

4జీ ఫీచర్ ఫోన్‌లకు ఊతమిచ్చే క్రమంలో.. Spreadtrum Communications వంటి చిప్‌సెట్ తయారీ కంపెనీలు చిప్‌సెట్‌ల ధరలను భారీగా తగ్గించినట్లు తెలుస్తోంది.

స్ప్రెడ్‌‌‌‌‌‌‌ట్రమ్ కమ్యూనికేషన్స్ ఇండియా

స్ప్రెడ్‌‌‌‌‌‌‌ట్రమ్ కమ్యూనికేషన్స్ ఇండియా

రూ.1500 4జీ ఫీచర్ ఫోన్‌కు అవసరమయ్యే చిప్‌సెట్ టెక్నాలజీ పై తాము పనిచేస్తున్నట్లు స్ప్రెడ్‌‌‌‌‌‌‌ట్రమ్ కమ్యూనికేషన్స్ ఇండియా హెడ్ నీరజ్ శర్మ తెలిపారు.

లయన్స్ జియోకు పోటీగా లావా, మైక్రోమాక్స్

లయన్స్ జియోకు పోటీగా లావా, మైక్రోమాక్స్

రిలయన్స్ జియోకు పోటీగా లావా, మైక్రోమాక్స్ వంటి దేశవాళీ కంపెనీలు ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. ఈ ఫోన్‌లు రూ.3,000 రేంజ్ లో అందుబాటులో ఉన్నాయి.

 మార్కెట్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది..
 

మార్కెట్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది..

మరోవైపు కార్బన్ మొబైల్స్ కూడా 4జీ ఫీచర్ ఫోన్ లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో లాంచ్ చేయబోయే రూ.1500 4జీ ఫోన్‌లకు సంబంధించి మార్కెట్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

 రెండు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాయి

రెండు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాయి

రిలయన్స్ ఇండస్ట్రీస్ అలానే స్ప్రెడ్‌‌‌‌‌‌‌ట్రమ్ కమ్యూనికేషన్స్ రెండు సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాయి. జియో లైఫ్ ఫ్లేమ్ 5 స్మార్ట్‌ఫోన్‌లకు చిప్‌సెట్‌‌లను సమకూర్చిన స్ప్రెడ్‌‌‌‌‌‌‌ట్రమ్ కమ్యూనికేషన్స్ త్వరలో లాంచ్ కాబోతున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌లకు కూడా ప్రాసెసర్‌లను సమకూర్చనున్నట్లు సమాచారం.

 8జీబి స్టోరేజ్ కెపాసిటీతో ..

8జీబి స్టోరేజ్ కెపాసిటీతో ..

కొన్ని బ్లాగ్స్ ఆధారంగా సేకరించిన సమచారం ప్రకారం... 8జీబి స్టోరేజ్ కెపాసిటీతో రాబోతున్న జియో 4జీ ఫీచర్ ఫోన్‌లు దాదాపుగా అన్ని సర్వీసులను సపోర్ట్ చేస్తాయట. వై-ఫై కనెక్టువిటీతో రాబోతున్నఈ ఫోన్‌లలో ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సైట్ లను కూడా ఉపయోగించుకునే వీలుంటుందట.

రూ.999 ధర ట్యాగ్‌లో..

రూ.999 ధర ట్యాగ్‌లో..

రూ.999 ధర ట్యాగ్‌లో లభ్యమయ్యే జియో 4జీ ఫీచర్ ఫోన్ 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు VGA ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుందట. ఇదే సమయంలో రూ.1499 ధర ట్యాగ్‌లో లభ్యమయ్యే ఫోన్ 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుందట. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రూ.999 మోడల్ 1800mAh బ్యాటరీతో, రూ.1499 మోడల్ 2300mAh బ్యాటరీతో రానున్నాయట.

మార్కెట్ సరళిని పరిశీలించినట్లయితే...

మార్కెట్ సరళిని పరిశీలించినట్లయితే...

ప్రస్తుత మార్కెట్ సరళిని పరిశీలించినట్లయితే మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు ఫీచర్ ఫోన్‌లు 2జీ నెట్‌వర్క్ పైనే రన్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు జియో ఫీచర్ ఫోన్‌లకు మరింతగా అనుకూలించే అవకాశం ఉంది.

 D-Pad ప్రధాన ఆకర్షణ...

D-Pad ప్రధాన ఆకర్షణ...

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఇమేజ్ ఇటీవల ఇంటర్నెట్‌లో రివీల్ అయ్యింది. టీ9 కీబోర్డ్‌తో వస్తోన్న ఈ ఫీచర్ ఫో‌న్‌లో D-Pad మరో ఆకర్షణగా నిలిచింది. కీబోర్డ్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ-ప్యాడ్‌లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్‌కట్ బటన్‌లను జియో ఏర్పాటు చేసినట్లు లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్‌ను కూడా జియో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Is Reliance Jio 4G feature phone likely priced at Rs. 1,500 coming soon?. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X