జీఎస్టీ ఎఫెక్ట్, జియో 4జీ ఫోన్ ధర రూ.2369

రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

|

ఈ ఏడాదికి గాను దేశమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫోన్‌ల జాబితాలో ఒక ఫీచర్ ఫోన్ కూడా ఉంది. అదే రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ 4జీ ఫీచర్ ఫోన్ ధర రూ.1500లోపు ఉండొచ్చని అంతా భావించినప్పటికి, తాజాగా రివీల్ అయిన రిపోర్ట్ ప్రకారం ఈ డివైస్ ధర రూ. 2369గా ఉండొచ్చని తెలుస్తోంది.

 

లైఫ్ బ్రాండింగ్‌తో రాబోతోంది..

లైఫ్ బ్రాండింగ్‌తో రాబోతోంది..

91మొబైల్స్ అనే వెబ్‌సైట్, తాజాగా పోస్ట్ చేసిన కథనం ప్రకారం జియో 4జీ ఫీచర్ ఫోన్ లైఫ్ బ్రాండింగ్‌తో రాబోతోంది. ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.2,369గా ఉంటుందని తెలుస్తోంది.

జీఎస్టీ కారణంగా 10శాతం అదనపు ట్యాక్స్..

జీఎస్టీ కారణంగా 10శాతం అదనపు ట్యాక్స్..

ఈ ఫోన్‌లో వినియోగించిన క్వాల్కమ్ 205 ప్రాసెసర్‌కు అదనంగా 10శాతం కస్టమ్ డ్యూటీని చెల్లించాల్సి రావటంతో ఫోన్ ధరను పెంచాల్సి వచ్చినట్లు సమచారం.

గతంలో రివీల్ అయిన పలు రిపోర్ట్స్ ప్రకారం..
 

గతంలో రివీల్ అయిన పలు రిపోర్ట్స్ ప్రకారం..

గతంలో రివీల్ అయిన పలు రిపోర్ట్స్ ప్రకారం Spreadtrum Chipతో వచ్చే జియో 4జీ ఫోన్ ధర రూ.1700లు గాను, Qualcomm 205 variant వేరియంట్‌తో వచ్చే జియో 4జీ ఫోన్ ధరను రూ.1800లుగాను జియో ఫిక్స్ చేసినట్లు తెలసింది. కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఫోన్‌ల ధరలను జియో సవరించినట్లు సమాచారం.

 జియో 4జీ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..?

జియో 4జీ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..?

2.4 అంగుల డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్. జియో లాంచ్ చేయబోతోన్న రెండు 4జీ ఫీచర్ ఫోన్‌లలో మొదటి వేరియంట్ వచ్చేసరికి Spreadtrum Chipతోనూ, రెండవ వేరియంట్ Qualcomm 205 Mobile Platformతోనూ రన్ అవుతాయట.

VoLTE సపోర్ట్‌తో పాటు వై-ఫై, NFC సపోర్ట్ కూడా...

VoLTE సపోర్ట్‌తో పాటు వై-ఫై, NFC సపోర్ట్ కూడా...

రూ. 2369 రేంజ్‌‌లో అందుబాటులో ఉండే జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో VoLTE సపోర్ట్‌తో పాటు వై-ఫై, NFC వంటి కనెక్టువిటీ ఆప్షన్స్ ఉండబోతున్నాయి. ఈ ఆధునిక వర్షన్ ఫీచర్ ఫోన్‌లో Wi-Fi tethering supportను పొందుపరిచే అవకాశముందని తెలుస్తోంది. ఇన్ని ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెకండరీ ఫోన్ క్రింద ఉపయోగించుకోవచ్చు.

D-Pad మరో ఆకర్షణ..

D-Pad మరో ఆకర్షణ..

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఇమేజ్ కొద్ది నెలల క్రితం ఇంటర్నెట్‌లో రివీల్ అయ్యింది. టీ9 కీబోర్డ్‌తో వస్తోన్న ఈ ఫీచర్ ఫో‌న్‌లో D-Pad మరో ఆకర్షణగా నిలిచింది. కీబోర్డ్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ-ప్యాడ్‌లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్‌కట్ బటన్‌లను జియో ఏర్పాటు చేసినట్లు లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్‌ను కూడా జియో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Reliance Jio 4G Feature Phone Could Carry a Price Tag of Rs. 2,369: Report. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X