రూ.999 జియో ఫోన్, ఫీచర్లు కేక..!

రూ.999, రూ.1499 ధర ట్యాగ్‌లలో విప్లవాత్మక 4జీ ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రిలయన్స్ జియో సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను జియో అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. రిలయన్స్ విడుదల చేయబోతున్న కారుచౌక 4జీ ఫీచర్ ఫోన్‌లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు జియో స్టోర్‌లు కూడా విక్రయించనున్నాయట.

Read More : షాకింగ్... నోకియా 3310 ఫోన్‌ ఆ దేశాల్లో పనిచేయదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

8జీబి స్టోరేజ్ కెపాసిటీ..?

కొన్ని బ్లాగ్స్ ఆధారంగా సేకరించిన సమచారం ప్రకారం... 8జీబి స్టోరేజ్ కెపాసిటీతో రాబోతున్న ఈ ఫోన్‌లు దాదాపు అన్ని జియో సర్వీసులను సపోర్ట్ చేస్తాయట. వై-ఫై కనెక్టువిటీతో రాబోతున్నఈ ఫోన్‌లలో ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సైట్ లను కూడా ఉపయోగించుకునే వీలుంటుందట.

5 మెగా పిక్సల్ కెమెరా..

రూ.999 ధర ట్యాగ్‌లో లభ్యమయ్యే ఫోన్ 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు VGA ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుందట. ఇదే సమయంలో రూ.1499 ధర ట్యాగ్‌లో లభ్యమయ్యే ఫోన్ 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుందట.

2300mAh బ్యాటరీ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రూ.999 మోడల్ 1800mAh బ్యాటరీతో, రూ.1499 మోడల్ 2300mAh బ్యాటరీతో రానున్నాయట.

నోకియా 3310 పై ప్రభావం..

పలు దేశవాళీ బ్రాండ్‌లకు సంబంధించిన ఫీచర్ ఫోన్‌లతో పాటు, త్వరలో మార్కెట్లోకి రాబోతున్న నోకియా 3310 (2017) వర్షన్ ఫోన్‌లకు జియో ఫీచర్ ఫోన్‌లు ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.

మార్కెట్ సరళిని పరిశీలించినట్లయితే

ప్రస్తుత మార్కెట్ సరళిని పరిశీలించినట్లయితే మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు ఫీచర్ ఫోన్‌లు 2జీ నెట్‌వర్క్ పైనే రన్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు జియో ఫీచర్ ఫోన్‌లకు మరింతగా అనుకూలించే అవకాశం ఉంది.

D-Pad మరో ఆకర్షణ..

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఇమేజ్ ఇటీవల ఇంటర్నెట్‌లో రివీల్ అయ్యింది. టీ9 కీబోర్డ్‌తో వస్తోన్న ఈ ఫీచర్ ఫో‌న్‌లో D-Pad మరో ఆకర్షణగా నిలిచింది. కీబోర్డ్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ-ప్యాడ్‌లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్‌కట్ బటన్‌లను జియో ఏర్పాటు చేసినట్లు లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్‌ను కూడా జియో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

Spreadtrum 9820 processorతో ..

జియో కారుచౌక 4జీ ఫీచర్ ఫోన్‌లు Jio యాప్ సూట్‌లోని లైవ్ టీవీ, జియో చాట్, జియో వాలెట్,వీడియో ఆన్ డిమాండ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయని తెలుస్తోంది. రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్న VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు Spreadtrum 9820 processorతో పని చేస్తాయని మరో రూమర్ చెబుతోంది. ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుందట.

మార్కెట్ మొత్తం జియో వైపే.?

రిలయన్స్ VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌తో సరిపెట్టుకుంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు పూర్తిగా జియో 4జీ వైపు మారిపోయే అవకాశం ఉంది.

మరి కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు

రిలయన్స్ జియో ఆఫర్ చేయబోయే చౌకబారు లైఫ్ ఈజీ 4జీ ఫోన్ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే,మరికొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు జియో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

జియో కొత్త ప్లాన్స్, ఆసక్తికర విషయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio 4G feature phones worth Rs.999 and Rs. 1,499 can stand against Nokia 3310 buzz. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot