జియో రూ.999 ఫోన్ ఇదే!

4G VoLTE సపోర్ట్‌తో, ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసేందుకు రిలయన్స్ జియో సిద్దమవుతోంది. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఇమేజ్ తాజాగా ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. టీ9 కీబోర్డ్‌తో వస్తోన్న ఈ ఫీచర్ ఫో‌న్‌లో D-Pad మరో ఆకర్షణగా నిలిచింది.

Read More : ఈ బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీగా ధర తగ్గించారు

జియో రూ.999 ఫోన్ ఇదే!

కీబోర్డ్ పై భాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ-ప్యాడ్‌లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్‌కట్ బటన్‌లను జియో ఏర్పాటు చేసినట్లు లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్‌ను కూడా జియో ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్స్ రివీల్ కావల్సి ఉంది.

Read More : మార్కెట్లోకి Obi Worldphone, రూ.5,500కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.990 నుంచి రూ.1500 రేంజ్‌లో

ఫీచర్ ఫోన్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ రూ.990 నుంచి రూ.1500 రేంజ్‌లో 4G VoLTE ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న జియో చౌక ధర 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్‌లు త్వరలోనే మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని సమాచారం.

ముందు వెనకా కెమెరాలు..

జియో కారుచౌక 4జీ ఫీచర్ ఫోన్‌లలో VoLTE ఫీచర్‌తో పాటు ముందు వెనకా కెమెరాలను కలిగి ఉండే ఈ ఫోన్‌లు ఉచిత్ కాల్స్‌ను ఆఫర్ చేయటంతో పాటు MyJio యాప్ సూట్‌లోని లైవ్ టీవీ, జియో చాట్, జియో వాలెట్,వీడియో ఆన్ డిమాండ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తాయని తెలుస్తోంది.

క్వాల్కమ్, మీడియాటెక్‌లతో చర్చలు

రిలయన్జ్ జియో ఫీచర్ ఫోన్‌లకు సంబంధించి చిప్‌సెట్‌ల కోసం క్వాల్కమ్ అలానే మీడియాటెక్ సంస్ధలతో రిలయన్స్ జియో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరో రిపోర్ట్ ప్రకారం చైనాకు చెందిన Spreadtrum జియో ఫీచర్ ఫోన్‌లకు చిప్‌సెట్‌లను
సమకూర్చనున్నట్లు తెలియవచ్చింది.

మరో రూమర్ ప్రకారం Spreadtrum 9820 processorతో

రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్న VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు Spreadtrum 9820 processorతో పని చేస్తాయని మరో రూమర్ చెబుతోంది. ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుందట.

2జీ నెట్‌వర్క్‌తో పనిలేదు..

రిలయన్స్ VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌తో సరిపెట్టుకుంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు పూర్తిగా జియో 4జీ వైపు మారిపోయే అవకాశం ఉంది.

యో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి

రిలయన్స్ జియో ఆఫర్ చేయబోయే చౌకబారు లైఫ్ ఈజీ 4జీ ఫోన్ కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే,మరికొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు జియో అపీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G VoLTE Feature Phone First Images Surface.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot