Home
Mobile

జియో 4G VoLTE ఫోన్‌ను ఇంటెక్స్ తయారు చేస్తోందా..?

ప్రత్యేకమైన ధర సబ్సిడీతో ఈ ఫోన్ దొరికే అవకాశం..

By Sivanjaneyulu Bommu

మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి రాబోతోన్న జియో 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్‌కు సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. జియో 4జీ వోల్ట్ ఫోన్లను ఇంటెక్స్ తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదరినట్లు సమాచారం.

జియో 4G VoLTE ఫోన్‌ను ఇంటెక్స్ తయారు చేస్తోందా..?

ఇంటెక్స్ తయారుచేయబోతోన్న జియో 4జీ వోల్ట్ ఫీచర్ ఫోన్‌లు ఆగష్టులో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎకనికమిక్ టైమ్స్ పోస్ట్ చేసిన కథనం ప్రకారం ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న 4జీ ఫీచర్ ఫోన్ ప్రత్యేకమైన ధర సబ్సిడీతో దొరకనుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన మార్కెటింగ్ పనులన్నీ జియో చూసుకుంటుందట. ఈ ఫోన్‌లను ప్రత్యేకమైన ప్లాన్‌లతో జియో విక్రయించనున్నట్లు సమాచారం.

1G, 2G, 3G, 4G, 5G అసలేంటివి..?

1G, 2G, 3G, 4G, 5G అసలేంటివి..?

టెక్నాలజీ రోజురోజుకు ముందుకు దూసుకుపోతోంది. దానికి తగ్గట్లుగానే 1జీ, 2జీ, 3జీ అంటూ ఒక్కో జనరేషన్ అమితవేగంతో ముందుకు దూసుకొస్తోంది.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 4జీ పూర్తి స్థాయిలో రానే లేదు.ఇప్పుడు 5జీ అంటూ ప్రపంచం ఉరుకులు పరుగులు పెడుతోంది. అసలింతకీ ఏంటీ ఈ నెట్‌వర్క్‌లు, ఈ జనరేషన్‌లు, వీటివల్ల ఉపయోగాలు ఏంటీ, అవి ఎలా పనిచేస్తాయి.. అసలు జీ అంటే ఏమిటీ..అనే విషయాలు చాలామంది తెలుసుకోవాలని ఉబలాటపడుతుంటారు. వారికోసం గిజ్‌బాట్ స్పెషల్ స్టోరీ అందిస్తుంది.. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి..

జీ అంటే జనరేషన్ అని అర్థం

జీ అంటే జనరేషన్ అని అర్థం

జీ అంటే జనరేషన్ అని అర్థం. కుప్తంగా చెప్పాలంటే ఓ తరానికి మరో తరానికి మధ్య ఉన్న తేడాను తెలుపుతుంది.టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ జనరేషన్ మారుతూ వస్తూ ఉంటుంది.

మొదటి తరం (1G )

మొదటి తరం (1G )

1980- 19990 మధ్య కాలం 3 1980- 19990 మధ్య కాలంలో ఈ జనరేషన్ పనిచేయడం ప్రారంభించింది. దీని వేగం దాదాపు 2.4 kbps వరకు ఉంటుందని అంచనా.. అయితే ఈ జనరేషన్ లో ఫోన్ లో ధ్వని తక్కువ కావడం అలాగే ఫోన్ సైజు చాలా పెద్దదిగా ఉండటంతో పాటు పరిమిత మైన సేవలు ఉండేవి.

రెండవ తరం (2G) 1991

రెండవ తరం (2G) 1991

ఈ జనరేషన్ మొట్టమొదటగా ఫిన్ ల్యాండ్ లో ప్రారంభమైంది. ఈ దశలో సిగ్నల్స్ అనేవి డిజిటల్ రూపంలో ఉండేవి కాబట్టి మీరు కాల్స్ అలాగే డేటానే ఎక్కడికైనా సులభంగా పంపుకునే వీలు ఉండేది. ఈ 2జీ నెట్ వర్క్ ఉన్న ఫోన్ ని మీరు ప్రపంచంలో ఏ దేశంలోనైనా వాడుకునే వీలుంది. ఇలా వాడుకోవాలంటే రోమింగ్ ఛారీలు చెల్లించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇవే మొదటి తరం ఫోన్లు అని చెప్పవచ్చు. వీటి సరాసరి వేగం 64 kbps.అయితే ఈ జనరేషన్లో వీడియో మెసేజ్ లకు ఛాన్స్ లేదు.

మూడవ తరం (3G)

మూడవ తరం (3G)

ఇది అసలైన జనరేషన్..ఇక్కడి నుంచే అసలైన యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. సెల్ ఫోన్లతో ఇంటర్నెట్ వాడుకునే అవకాశం ఈజనరేషన్ నుంచే వచ్చింది. ఈ జనరేషన్ లో సెల్ ఫోన్లు మాత్రమే కాదు ట్యాబ్లెట్లు కూడా రావడం మొదలయ్యాయి. డేటా స్పీడు 144 Kbps to 2mbps వరక ఉంటుంది. ఈ జనరేషన్ లోనే మనకు వీడియో కాలింగ్ , వాయిస్ కాలింగ్ , ఫైల్ ట్రాన్సిమిషన్ ,ఇంటర్నెట్ సెర్చింగ్ ,ఆన్ లైన్ టీవీ ఇంకా గేమ్స్ అన్ని రకాల సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడూ ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్నవారికి 3జీ అనేది ఓ వరం లాంటిదనే చెప్పవచ్చు.

నాలుగవ తరం (4G)

నాలుగవ తరం (4G)

3జీలో డాటా ట్రాన్సఫర్ కన్నా 4జీలో చాలా ఫాస్ట్ గా అవుతుంది. అక్కడ 144 Kbps to 2mbps ఉంటే అది 4జీకి వచ్చేసరికి 100 mbps నుంచి 1Gbps వరకు వచ్చింది. దాదాపు చాలాదేశాల్లో ఈ నాలుగవ తరం వాడుకలోకి వచ్చింది. అయితే ఈ జనరేషన్లో ఫోన్ బ్యాటరీ దెబ్బకు అయిపోతుంది. మీరు అన్ని రకాల సదుపాయాలు వాడుకునే వీలుంది కాని..హీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండదు..క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక మొబైల్ బ్రాండ్ అంతే..దీని వేగం చాలా ఎక్కువ కాబట్టి బ్యాటరీ కూడా అంతే వేగంతో అయిపోతుంది.

ఐదవ తరం (5G)

ఐదవ తరం (5G)

ఈ తరం గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది. దీనికి అసలు హద్దులే లేవు. ఇది పూర్తిగా వైర్‌లెస్ టెక్నాలజీతో కూడుకున్నది. 4జీ httpని సపోర్ట్ చేస్తే 5G WWWW Wireless World Wide webను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది హై స్పీడ్, హై కెపాసిటీతో కూడుకున్నది. దీని డేటా ట్రాన్సఫర్ వేగం దాదాపు Gbpsలోనే ఉంటుంది. అంటే మీరు హెచ్‌డి క్వాలిటీతో కూడిన సినిమాలను ఎలాంటి అంతరాయం లేకుండా చూడొచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio and Intex join hands to make 4G VoLTE feature phone. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X