జియో రూ.500 ఫోన్ బుకింగ్స్ రేపటి నుంచే..?

రూ.500కే జియో 4G VoLTE ఫీచర్ ఫోన్ విడుదల కాబోతోందన్న వార్తలు ఊపందుకుంటున్న నేపథ్యంలో, ఈ ఫోన్ ఎప్పుడొస్తుందా అని ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం జూలై 21న ముంబైలో జరగబోయే రిలయన్స్ ఇండస్ట్రీస్ యూన్యువల జనరల్ మీటింగ్‌లో భాగంగా ఈ ఫోన్ అనౌన్స్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జూలై 22 నుంచి ప్రీ-బుకింగ్స్

91మొబైల్స్ అనే వెబ్‌సైట్ కొద్ది గంటల క్రితం పోస్ట్ చేసిన ఓ కధనం ప్రకారం 21న మార్కెట్లో అనౌన్స్ కాబోతోన్న జియో 4G VoLTE ఫీచర్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ జూలై 22 నుంచి ప్రారంభమవుతాయట. ఆఫ్‌లైన్ స్టోర్‌లోకి వెళ్లి ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవల్సి ఉంటుందట.

రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది..

రిలయన్స్ జియో నుంచి లాంచ్ కాబోతోన్న 4G VoLTE ఫీచర్ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని సమాచారం. ఇందులో మొదటిది Spreadtrum ప్రాసెసర్ పైనా, రెండవది Qualcomm 205 ప్రాసెసర్ పైనా రన్ అవుతాయని తెలుస్తోంది.

జియో 4G VoLTE ఫోన్ స్పెసిఫికేషన్స్..

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

LTE Cat 4 బ్యాండ్‌..

LTE Cat 4 బ్యాండ్‌లోని 850MHz, 1800MHz, 2300MHz స్పెక్ట్రమ్‌ను జియో 4జీ ఫీచర్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 2జీ నెట్ వర్క్ విషయానికి వచ్చేసరికి 900MHz, 1800MHz స్పెక్ట్రమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

ఆగష్టు 15 నుంచి మార్కెట్లో..

గతంలో లాంచ్ అయిన ఫీచర్ ఫోన్‌లతో పోలిస్తే అడ్వాన్సుడ్ ఫీచర్లతో రాబోతోన్న ఈ ఫోన్ ఆగష్టు 15 నుంచి మార్కెట్లో దొరికే అవకాశముందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio 4G VoLTE Feature Phone Pre-Bookings Could Start on July 22: Report. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot