Home
Mobile

జియో సునామి : రూ.49కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్, అయితే..

దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియోఫోన్ ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే.

By Hazarath

దేశీయ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జియోఫోన్ ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రకాల షరతులతో ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.ఈ ఫోన్ యూజర్లకు జియో ఇప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ పోతోంది. కాగా ఈ ఫోన్ కావాలనుకున్న వారు జియో వెబ్‌సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. మరి లేటెస్ట్ గా జియోఫోన్ యూజర్లకి తీసుకొచ్చిన జియో ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.

రూ.49 ప్లాన్‌

రూ.49 ప్లాన్‌

జియోఫోన్‌ యూజర్లకు కొత్త ప్రీ-పెయిడ్‌ టారిఫ్‌ ప్లాన్‌ను జియో ప్రకటించింది. ఉచిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 4జీ డేటాతో సరికొత్తగా రూ.49 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల పాటు ఈ టారిఫ్‌ ప్లాన్‌ వాలిడ్‌లో ఉంటుందని జియో తెలిపింది. కాగా నేటి నుంచి ఈ ప్లాన్‌ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

ఇంతకు ముందు..

ఇంతకు ముందు..

ఇంతకు ముందు జియోఫోన్‌ రూ.153 ప్లాన్‌తో తొలుత ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్‌లో ఉచిత వాయిస్‌, అపరిమిత డేటా, జియో యాప్స్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు ఈ ఫ్లాన్ నుంచి జియో రూ.49తో ముందుకు దూసుకువచ్చింది.

అదనపు డేటా..

అదనపు డేటా..

ఇక అదనపు డేటా కోసం చూస్తున్న కస్టమర్ల కోసం జియో రూ.11, రూ.21, రూ.51, రూ.101లలో కొత్త డేటా ఆడ్‌-యాన్లను ప్రకటించింది.ఈ ప్లాన్లను జియో అఫిషియల్ సైట్లో పొందుపరిచింది. కాగా జియో ఫోన్ దేశంలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.

 99 శాతం దేశీయ జనాభాను..

99 శాతం దేశీయ జనాభాను..

వచ్చే ఏళ్లలో 99 శాతం దేశీయ జనాభాను కవర్‌ చేయాలని రిలయన్స్‌ జియో ప్లాన్‌చేస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే 10వేల ఆఫీసులను, ఫిజికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ కోసం 10 లక్షల అవుట్‌లెట్లను ఇది ప్రారంభించబోతుంది.

జియో ఫోన్ ఫీచర్లు

జియో ఫోన్ ఫీచర్లు

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

మూడేళ్ల తరువాత..

మూడేళ్ల తరువాత..

మూడేళ్ల తరువాత ఇప్పుడు చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేసే విధంగా జియో తన ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కాగా ఈ ఫోన్ కేవలం నలుపురంగులో మాత్రమే లభిస్తోంది. ఈ ఫోన్ లో దాదాపు 23 రకాల భాషలు ఉన్నాయి. మీకు నచ్చిన భాషని ఎంపిక చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.

ఫ్రీ లోడెడ్ యాప్స్ ..

ఫ్రీ లోడెడ్ యాప్స్ ..

జియో ఫోన్ లో మైజియో, మ్యూజిక్, సినిమా, జియో టివి, జియో మని, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ లాంటి ఫ్రీ లోడెడ్ యాప్స్ ఉన్నాయి. వీటిని మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు. ఇందులో ఓ ఎమర్జెన్సీ బటన్ ఉంది. మీరు జియో ఫోన్ నుంచి 5 బటన్ ట్యాప్ చేయడం ద్వారా 100, 108లాంటి వాటికి కాల్ వెళుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio announces new Rs 49 plan with unlimited data and calling for JioPhone users More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X