ఫ్రీ అంటూనే అదనపు ఛార్జీల బాదుడు షురూ చేసిన జియో
జియో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రిలయన్స్ ఫీచర్ ఫోన్లపై ఛార్జీల బాదుడు మొదలైంది.
జియో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రిలయన్స్ ఫీచర్ ఫోన్లపై ఛార్జీల బాదుడు మొదలైంది. సున్నాకే జియో ఫోన్.. మీరు కట్టే మొత్తం మూడేళ్లకే రీఫండ్ చేస్తామంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చిన జియో కొనుగోలుదారులపై అదనపు ఛార్జీల భారం వేయనుందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

1500 రూపాయలకి అదనంగా మరింత..
జియో ఫోన్ రిజిస్ట్రర్ చేసుకుని ఆ ఫోన్ పొందిన వారికి కేవలం రూ.1500తోనే అన్ని రావడం లేదు. ఆ 1500 రూపాయలకి అదనంగా మరింత చెల్లించాల్సి వస్తుంది. వాటిని సిమ్ ఛార్జీలుగా, రీఛార్జ్ మొత్తాలుగా జియో బాదుడు షురూ చేసింది.

జియో సిమ్ కోసం అదనంగా రూ.110..
జియో ఫోన్‌తో పాటు సిమ్ కూడా ఉచితమని ఇప్పటి వరకు వినియోగదారులు భావించి ఉంటారు. కానీ జియో ఫోన్‌లో వాడే జియో సిమ్ కోసం అదనంగా రూ.110 చెల్లించాల్సి ఉంది.

రూ.153తో లేదా రూ.309తో రీఛార్జ్..
దీంతో పాటు ఆ సిమ్‌ను వాడుకోవడానికి అపరిమిత డేటా, అపరిమిత కాలింగ్, ఎస్‌ఎంఎస్ వంటి వాటి కోసం రూ.153తో లేదా రూ.309తో రీఛార్జ్ చేయించుకోవాలి.

జియో ఫోన్‌కు రూ.2000 మేర ఖర్చు..
మొత్తంగా ఫోన్ సొంతం చేసుకున్న యూజర్లు మరో 400 రూపాయల మేర అదనంగా చెల్లించాలి. ఈ మొత్తాలన్నింటినీ కలుపుకుంటే జియో ఫోన్‌కు రూ.2000 మేర ఖర్చు అవుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మెట్రో నగరాలకు..
కాగా, చిన్న పట్టణాలకు దసరా నుంచే ఈ ఫోన్ల డెలివరీని ప్రారంభించిన జియో, ప్రస్తుతం మెట్రో నగరాలకు అందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో జియో ఫోన్ల డెలివరీ ప్రారంభమైంది.

నిబంధలను కాస్త..
జియో ఫోన్ పూర్తిగా ఉచితమని, ప్రారంభంలో రూ.1500 డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిన కంపెనీ, ఆ తర్వాత నిబంధలను కాస్త సడలించింన విషయం తెలిసిందే.

దీపావళి తర్వాత మలి విడత జియో ఫోన్ల బుకింగ్
మొదటి ఏడాది తర్వాత ఆ ఫోన్‌ను వెనక్కి ఇచ్చేస్తే రూ.500, రెండో ఏడాది తర్వాత రూ.1000, మూడేళ్ల తర్వాత అయితే మొత్తం పొందవచ్చని తెలిపింది. ఇక దీపావళి తర్వాత మలి విడత జియో ఫోన్ల బుకింగ్‌ను కంపెనీ చేపట్టబోతుంది.


Click it and Unblock the Notifications








