జియోఫోన్లు ఎన్ని అమ్ముడుపోయాయి,మార్కెట్లో వాటి రిజల్ట్ ఏంటీ ?

గతేడాది దేశీయ మొబైల్ రంగాన్ని, టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన అంశం ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియోనే.

|

గతేడాది దేశీయ మొబైల్ రంగాన్ని, టెలికాం రంగాన్ని ఓ కుదుపు కుదిపిన అంశం ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియోనే. వచ్చి రావడంతోనే ఉచిత ఆఫర్లతో యూజర్లను కట్టిపడేసిన జియో అప్పటివరకు టెలికాం రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న దిగ్గజాలకు చుక్కలు చూపించింది. జియో దెబ్బకు భారీ నష్టాలను మూటగట్టుకున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఇదిలా ఉంటే జియోఫోన్ అంటూ మళ్లీ మొబైల్ మార్కెట్లో పెను ప్రకంపనలు రేపింది. అయితే ఆ ఫోన్లు ఇప్పటిదాకా ఎన్ని అమ్ముడు పోయాయి అనే దానిపే కంపెనీ స్పష్టత ఇవ్వనప్పటికీ ఇప్పుడు ఓ సర్వే ఆ ఫోన్ల వివరాలను బహిర్గతం చేసింది.

జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !జియో ఫీచర్ ఫోన్ స్పెషల్ రివ్యూ : ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదు !

దాదాపు 4 కోట్ల ఫోన్లు..

దాదాపు 4 కోట్ల ఫోన్లు..

క్రెడిట్‌ స్యూజ్‌ చేపట్టిన అధ్యయనం ప్రకారం జియోఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 4 కోట్ల ఫోన్లు అమ్ముడుపోయినట్టు తెలిసింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2018 జనవరి-మార్చి క్వార్టర్‌లో ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌ షేరులో జియోఫోన్‌ 36 శాతం షేరును తన సొంతం చేసుకుందని తెలిసింది.

మార్కెట్‌బేస్‌ను విస్తరించుకోవడానికి..

మార్కెట్‌బేస్‌ను విస్తరించుకోవడానికి..

జియో తన మార్కెట్‌బేస్‌ను విస్తరించుకోవడానికి ఈ ఫోన్ ఎంతో దోహదం చేసిందని క్రెడిట్‌ స్యూజ్‌ పేర్కొంది. ఈ క్వార్టర్‌లో 2.1 కోట్ల జియోఫోన్‌ విక్రయాలు జరిగాయని అంటే నెలకు 70 లక్షల జియోఫోన్‌లు అమ్ముడుపోయినట్టు సర్వే పేర్కొంది.

రూ.49తో ప్లాన్‌తో భారీ ఎత్తున్న జియోఫోన్‌ విక్రయాలు

రూ.49తో ప్లాన్‌తో భారీ ఎత్తున్న జియోఫోన్‌ విక్రయాలు

రిపోర్టు ప్రకారం జనవరిలో కంపెనీ అత్యంత చౌకగా రూ.49తో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో భారీ ఎత్తున్న జియోఫోన్‌ విక్రయాలు కూడా నమోదుతున్నాయని రిపోర్టు తెలిపింది. మొత్తంగా జియో వృద్ధికి అత్యంత కీలకమైన పాత్రను జియోఫోన్‌ పోషిస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది.

జియో ఫోన్‌ను కస్టమర్లు..

జియో ఫోన్‌ను కస్టమర్లు..

అయితే జియోఫోన్‌ ఇతర ఫోన్ల మార్కెట్‌ షేరును తినేస్తోందా? లేదా జియో ఫోన్‌ను కస్టమర్లు రెండో డివైజ్‌లాగా కొనుగోలు చేస్తున్నారా? అని తెలుసుకోవడం మాత్రం కష్టతరంగా మారినట్టు సర్వే పేర్కొంది. ఇంక్యూబెంట్ల సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను ఇది తన వైపుకు లాగేసుకోవడం ప్రారంభించిందని నివేదించింది.

జియోఫోన్ ఫీచర్లు

జియోఫోన్ ఫీచర్లు

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యాప్.

కేవలం నలుపు రంగులో మాత్రమే

కేవలం నలుపు రంగులో మాత్రమే

ఇది కేవలం నలుపు రంగులో మాత్రమే లభిస్తుంది. నలుపంటే ఇష్టపడేవారికి జియో ఫోన్ చాలా బాగా నచ్చుతుంది.ఈ ఫోన్ లో సరికొత్తగా టీవికి అనుసంధానం చేసే ఫీచర్ ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా మీరు టివిలో మీకు నచ్చినది చూసే అవకాశం ఉంది. ఏ టివికైనా సెట్ అయ్యే విధంగా ఈ ఫీచర్ ని రూపొందించారు.

ఎమర్జెన్సీ బటన్

ఎమర్జెన్సీ బటన్

ఇందులో ఓ ఎమర్జెన్సీ బటన్ ఉంది. మీరు జియో ఫోన్ నుంచి 5 బటన్ ట్యాప్ చేయడం ద్వారా 100, 108లాంటి వాటికి కాల్ వెళుతుంది.ఈ ఫోన్ లో దాదాపు 23 రకాల భాషలు ఉన్నాయి. మీకు నచ్చిన భాషని ఎంపిక చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు.

ఫ్రీ లోడెడ్ యాప్స్

ఫ్రీ లోడెడ్ యాప్స్

జియో ఫోన్ లో మైజియో, మ్యూజిక్, సినిమా, జియో టివి, జియో మని, జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్ లాంటి ఫ్రీ లోడెడ్ యాప్స్ ఉన్నాయి. వీటిని మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోనవసరం లేదు.

వాయిస్ ఎనేబుల్డ్

వాయిస్ ఎనేబుల్డ్

గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ సిరి, మైక్రోసాఫ్ట్ కొర్టానా మాదిరిగానే జియో ఫోన్ కూడా వాయిస్ ఎనేబుల్డ్ గా తయారైంది. అంటే మీ చేతులు ఉపయోగించకుండానే SMS పంపే అవకాశం ఉంది. వాయిస్ ద్వారానే కాల్స్, సందేశాలు పంపుకోవచ్చు.

 సింగిల్ సిమ్

సింగిల్ సిమ్

ఈ ఫోన్ పూర్తిగా ఉచితంగానే అని కంపెనీ చెబుతోంద.ఫస్ట్ రూ. 1500 డిపాజిట్ కింద తీసుకున్నా మూడేళ్ల తరువాత అది తిరిగి రీఫండ్ చేస్తామని జియో చెబుతుంది. అతి తక్కువ ధరలో వీడియో కాలింగ్ సపోర్ట్ తో లభిస్తున్న ఫోన్ జియో ఫోన్ ఒక్కటేనని మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ ఫోన్ సింగిల్ సిమ్ తో వస్తుంది కాబట్టి డ్యూయెల్ సిమ్ వాడే అభిమానులకు ఇది నచ్చకపోవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio Has Sold 40 Million JioPhones So Far, Says Report More new at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X