సామ్‍‌సంగ్ ఫోన్లపై జియో సంచలన ఆఫర్లు

|

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2018) ఇంకా గెలాక్సీ జే7 డ్యుయో స్మార్ట్‌ఫోన్‌ల పై పలు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌లను జియో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ స్కీమ్‌లో భాగంగా గెలాక్సీ జే2 (2018) మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు రూ.2,750 వరకు క్యాష్‌బ్యాక్ లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా జియో నుంచి 100జీబి వరకు 4జీ డేటా వీరికి లభిస్తుంది.ఈ డేటాను నెలకు 10జీబి చొప్పున 10 నెలల పాటు ఉపయోగించుకో వల్సి ఉంటుంది. సెప్టంబర్ 30, 2018వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రూ.198 నుంచి రూ.299 వరకు రీఛార్జ్ చేసుకునే ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్ పైనా ఈ 10 జీబి అదనపు డేటా లభిస్తుంది. గెలాక్సీ జే2 తరహాలోనే గెలాక్సీ జే7 డ్యుయో కొనుగోలు పైనా రూ.2,750 వరకు క్యాష్‌బ్యాక్‌ను యూజర్ పొందే వీలుంటుంది. ఇదే సమయంలో డేటా బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.

 
సామ్‍‌సంగ్ ఫోన్లపై జియో సంచలన ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే2 (2018) స్పెసిఫికేషన్స్..
5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.8,190.

వాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండివాట్సప్‌లో ఈ మెసేజ్ చక్కర్లు కొడుతోంది, దూరంగా ఉండండి

సామ్‍‌సంగ్ ఫోన్లపై జియో సంచలన ఆఫర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 డ్యుయో స్పెసిఫికేషన్స్..
5.5 ఇంచ్ హై-డెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 7 సిరీస్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తదితర ఫీచర్లు ఈ డివైస్‌లో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio has introduced exclusive offers on two Samsung smartphones - the Galaxy J2 (2018) and Galaxy J7 Duo under which the telco has announced cash back and other benefits to its users.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X