Home
Mobile

రూ.1,000కే 4G VoLTE స్మార్ట్‌ఫోన్?

రిలయన్స్ లాంచ్ చేయబోయే చౌకధర 4G VoLTE స్మార్ట్‌ఫోన్ పేరు “LYF Easy”..

By Sivanjaneyulu Bommu

4G VoLTE స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో రిలయన్స్ జియో సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నట్లు సమాచారం. న్యూ వరల్డ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం రిలయన్స్ జియో రూ.1000కే 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

 రూ.1,000కే  4G VoLTE స్మార్ట్‌ఫోన్?

Read More : Paytm యాప్ వల్ల 5 లాభాలు

ఈ ఫోన్‌లు 2017 జనవరిలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముందని సమాచారం. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ రూమర్స్‌కు సంబంధించి రిలయన్స్ జియో ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. 4G VoLTE టెక్నాలజీని ప్రతిఒక్కరికి చేరువచేసే క్రమంలో రిలయన్స్ ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జియో వెల్‌కమ్ ఆఫర్...

జియో వెల్‌కమ్ ఆఫర్...

రిలయన్స్ లాంచ్ చేయబోయే చౌకధర 4G VoLTE స్మార్ట్‌ఫోన్ పేరు "LYF Easy"గా ఉండొచ్చని టెలీఅనాలిసిస్ అనే రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. జియో వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 31తో ముగుస్తున్న నేపథ్యంలో జనవరి ఆరంభంలో ఈ ఫోన్‌లకు సంబంధించిన లాంచ్ ఈవెంట్ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఎంట్రీ స్థాయి ఫీచర్..

ఎంట్రీ స్థాయి ఫీచర్..

రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌ల విభాగంలోనూ 4జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 4G VoLTE టెక్నాలజీతో రిలయన్స్ అందింబోతున్న ఎంట్రీ స్థాయి ఫీచర్ ఫోన్‌ల ధర రూ.1000 నుంచి రూ.1500 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్

50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో, రిలయన్స్ జియో VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఫీచర్ ఫోన్‌లలోనూ జియో డేటా..

ఫీచర్ ఫోన్‌లలోనూ జియో డేటా..

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే ఫీచర్ ఫోన్‌లలోనూ జియో డేటా ఇంకా వాయిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో జియో సేవలను పొందేందుకు ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా అతితక్కువ ధరల్లోనే 4జీ సేవలను ఆస్వాదించవచ్చు.

Spreadtrum 9820 processorతో...

Spreadtrum 9820 processorతో...

రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్న VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు Spreadtrum 9820 processorతో పని చేస్తాయట. ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుంది.

గ్రామీణ ప్రజలే టార్గెట్..

గ్రామీణ ప్రజలే టార్గెట్..

రిలయన్స్ VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌తో సరిపెట్టుకుంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు పూర్తిగా జియో 4జీ వైపు మారిపోయే అవకాశం ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio To Launch Cheapest 4G Smartphones Priced Around Rs.1,000 in 2017. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X