జియో వాడుతున్నారా? ఈ ఆఫర్‌ను చెక్ చేసుకోండి
ఆఫర్ రూ.6,600 నుంచి రూ.9,700లోపు ఫోన్ల పై వర్తిస్తుంది.
రిలయన్స్ జియో మరో కొత్త ఆఫర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. తమ Lyf స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించుకుంటోన్న యూజర్లకు 20% అదనపు డేటాను ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.

లైఫ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనండి, 20శాతం అదనపు 4జీ డేటాను పొందండంటూ జియో అఫీషియల్ సైట్ పేర్కొంది. అయితే, ఈ ఆఫర్ అనేది రూ.6,600 నుంచి రూ.9,700లోపు లైఫ్ ఫోన్‌ల పై మాత్రమే వర్తిస్తుంది.

సైబర్ మీడియా రిసెర్చ్ తాజాగా రివీల్ చేసిన వివరాల ప్రకారం మార్కెట్లో రిలయన్స్ లైఫ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. 2016 రెండవ క్వార్టర్‌లో 2.2 మిలయన్ యూనిట్లుగా ఉన్న లైఫ్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు నాలుగవ క్వార్టర్ నాటికి 7.4 లక్షలకు పడిపోయినట్లు సైబర్ మీడియా రిసెర్చ్ వెల్లడించింది. ఇదే సమయంలో వివో, ఒప్పో, జియోనీ, వంటి బ్రాండ్‌లు ఆఫ్‌లైన్ మార్కెట్లో పుంజుకున్నట్లు సదురు రిసెర్చ్ తెలిపింది.


Click it and Unblock the Notifications